మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ.. ఫిబ్రవరి ఆరో తేదీన సుప్రీం విచారణ
bbc documentary:ఇండియా: ద మోదీ క్వశ్చన్ పేరుతో బీబీసీ తీసిన డాక్యుమెంటరీని కేంద్రం బ్యాన్ చేసింది. ఆ నిషేధాన్ని కొందరు సవాల్ చేశారు. దానిపై సుప్రీంకోర్టు ఆరున విచారణ చేపట్టనున్నది.
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఆ నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసుపై వచ్చే సోమవారం విచారణ చేపట్టనున్నట్లు ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహా, జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను పరిశీలించింది. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లలో మోదీ హస్తం ఉన్నట్లు బీబీసీ తన డాక్యుమెంటరీలో చూపించింది. దీంతో ఆ డాక్యుమెంటరీ వివాదాస్పదమైంది.
ఆ డాక్యుమెంటరీని యూట్యూబ్, ట్విట్టర్లో షేర్ చేయరాదు అంటూ ఇటీవల కేంద్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అయితే రెండు భాగాలు ఉన్న ఆ డాక్యుమెంటరీని బ్యాన్ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఎంఎల్ శర్మ తన పిటిషన్లో ఆరోపించారు.
మాజీ జర్నలిస్టు ఎన్ రామ్, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాలు కూడా ఈ అంశంపై పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటీషన్లను కూడా ఫిబ్రవరి ఆరో తేదీన విచారించనున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

