కాంగ్రెస్‌లోకి ఆజంఖాన్…? వెల్కమ్ అంటూ కాంగ్రెస్ ఫ్లెక్సీలు
ఆజంఖాన్ సమాజ్‌వాదీ నుంచి జంప్ చేస్తున్నారా? కొన్ని రోజుల పరిణామాలను చూస్తుంటే ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన, శివపాల్ యాదవ్ కలిసి ఓ కొత్త పార్టీ స్థాపించనున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా.. .మరో వార్త కూడా వచ్చి చేరింది. కాంగ్రెస్‌లో చేరాలంటూ ఆయనపై ఒత్తిడి వచ్చినట్లు సమాచారం.
ఏకంగా కాంగ్రెస్ పక్షాన ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. వెల్కమ్.. వెల్కమ్.. అంటూ కాంగ్రెస్ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో ఆయన్ను కాంగ్రెస్ దువ్వుతోందని స్పష్టమవుతోంది. ప్రయాగరాజ్ ముస్లిం లీడర్ ఇర్షద్ ఉల్లా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ ఫోటోలో ప్రియాంక గాంధీతో పాటు యూపీ ప్రముఖులు కూడా ఉండటంతో రాజకీయంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఇంకో ఆసక్తి ఏమిటంటే ఆచార్య ప్రమోద్ క్రిష్ణమ్ ఫోటో కూడా ఉంది. ఈయన ఆజంఖాన్‌తో జైల్లో ములాఖాత్ కూడా అయ్యారు.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ కూడా చాలా సాఫ్ట్‌గానే స్పందించింది. ఆజంఖాన్ కేవలం సమాజ్‌వాదీ పార్టీ నేతే కాదని, రాష్ట్రంలో సీనియర్ నేత అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అన్షు అవస్థి పేర్కొన్నారు. ప్రయాగరాజ్‌లో ఆయన నేతృత్వంలో కుంభమేళాను కూడా సక్సెస్ చేశారని తెలిపారు. బీజేపీ దురదృష్టవశాత్తు ఆయనపై కేసులు మోపుతోందని, అయినా… సొంత పార్టీ సమాజ్‌వాదీ మాత్రం ఈ కేసులకు వ్యతిరేకంగా పోరాటమే చేయడం లేదని మండిపడ్డారు.

అధిష్ఠానంపై గుర్రుగా ఉన్న ఆజంఖాన్
సమాజ్‌వాదీ పార్టీ అధిష్ఠానంపై ఆజంఖాన్ సీరియస్‌గా ఉన్నారు. ఇన్ని రోజులు శైలు శిక్ష అనుభవిస్తున్నా… తన పక్షాన వకాల్తా పుచ్చుకోవడం లేదని, తనను కలవడానికి కూడా అఖిలేశ్ జైల్‌కు రాలేదన్నది ఆయన ప్రధాన ఆరోపణ. అసలు ఆజంఖాన్ జైలు నుంచి బయటికి రావడం అఖిలేశ్‌కు ఏమాత్రం ఇష్టం లేదని, ఒకవేళ అఖిలేశ్ తలుచుకుంటే ఎప్పుడో బయటికి వచ్చేసే వారని ఆయన వర్గీయులే కామెంట్స్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

