Ayodhya Ram Temple : విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేళ మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం : బీజేపీ డిమాండ్
జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవ వేడుకలకు (Ayodhya Ram Temple) సర్వం సిద్ధమవుతోంది. అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగే రోజున మద్యం, మాంసం విక్రయాలను నిషేధించాలని బీజేపీ ఎంపీ దీపక్ ప్రకాష్ డిమాండ్ చేశారు.
రాంచీ : జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవ వేడుకలకు (Ayodhya Ram Temple) సర్వం సిద్ధమవుతోంది. అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగే రోజున మద్యం, మాంసం విక్రయాలను నిషేధించాలని బీజేపీ ఎంపీ దీపక్ ప్రకాష్ డిమాండ్ చేశారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు రాసిన లేఖలో ఎంపీ ఈ మేరకు 22న జరిగే ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రాష్ట్రంలో మద్యం, మాంసం విక్రయాలు నిలిపివేయాలని కోరారు.
ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడిగా పేరొందిన రాముడు 14 ఏండ్లు వనవాసం చేశారని, ఆపై రాజ్యాన్ని పాలిస్తూ సత్యం, దయ, కరుణ చూపుతూ ప్రజారంజక పాలన కొనసాగించారని లేఖలో ఎంపీ వివరించారు. ఇప్పటికీ సంస్కృతి, నైతిక విలువల గురించి మాట్లాడితే అందరూ శ్రీరాముడి పేరును ప్రస్తావిస్తారని గుర్తుచేశారు.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈ దిశగా ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. జార్ఖండ్ ప్రజల ఆకాంక్షలకు తలొగ్గుతారా లేక బుజ్జగింపు రాజకీయాలను విశ్వసిస్తారా అనేది ఆయన తేల్చుకోవాలని అన్నారు. జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ సహా దేశవిదేశాల నుంచి పలువురు వీవీఐపీలు హాజరు కానున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ayodhya Ram Temple
- ban
- BJP
- liquor
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

