Ayodhya Ram Mandir | మార్చి 2025 నాటికి అయోధ్య రామాలయం పనులన్నీ పూర్తి : నృపేంద్ర మిశ్రా
Ayodhya Ram Mandir | అయోధ్య రామమందిరం నిర్మాణ పనులను కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
Ayodhya Ram Mandir | అయోధ్య రామమందిరం నిర్మాణ పనులను కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రామమందిరం మొదటి అంతస్తు నిర్మాణం 90శాతం పూర్తయ్యిందని పేర్కొంది. వచ్చే జూలై నాటికి తొలి అంతస్తు పూర్తిగా సిద్ధమవుతుందన్నారు. మొదటి అంతస్తులో రామ్ దర్బార్‌ను ఏర్పాటు చేయనున్నారు. 2025 మార్చి నాటికి ప్రాకారంతో సహా మంది నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఆ తర్వాత తొలి అంతస్తులో రామ్ దర్బార్ విగ్రహాలను పాలరాతితో తయారు చేయనున్నట్లు నృపేంద్ర పేర్కొన్నారు.
ఇందుకోసం రాజస్థాన్‌కు చెందిన నలుగురు శిల్పులతో చర్చలు జరిపారని.. టెండర్ ప్రక్రియ సైతం జారీ చేసినట్లు పేర్కొన్నారు. నెలాఖరులోగా టెండర్లు తెరువనున్నట్లు చెప్పారు. విగ్రహ తయారీకి శిల్పిని ఎంపిక చేస్తారన్నారు. ఇదిలా ఉండగా.. గర్భాలయంలో కొలువుదీరిన రామ్‌లల్లాను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం నిత్యం లక్షమందికిపైగా భక్తులు తరలివస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఇప్పటి వరకు దాదాపు రెండుకోట్ల మందికిపైగా దర్శనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. సమావేశంలో రామ మందిరం నిర్మాణ పురోగతి, మ్యూజియం నిర్మాణంపై చర్చించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

