మొదటి టార్గెట్ సల్మాన్!
ఇటీవల బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులు తొలుత నటుడు సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకొన్నారని విశ్వసనీయ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం వారు సల్మాన్ ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించారని, అయితే అక్కడ పోలీస్ భద్రత ఉండటంతో వారు తమ ప్లాన్ మార్చుకొని టైగర్ ష్రాఫ్‌పై తమ దృష్టిని సారించాయని తెలిపాయి.
ముంబై: ఇటీవల బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులు తొలుత నటుడు సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకొన్నారని విశ్వసనీయ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం వారు సల్మాన్ ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించారని, అయితే అక్కడ పోలీస్ భద్రత ఉండటంతో వారు తమ ప్లాన్ మార్చుకొని టైగర్ ష్రాఫ్‌పై తమ దృష్టిని సారించాయని తెలిపాయి. ప్రతి ఆదివారం జుహులోని ఒక ఫుట్‌బాల్ మైదానాన్ని ష్రాఫ్ సందర్శిస్తాడని.. అక్కడ పరిమితమైన భద్రత ఉంటుందని సోషల్ మీడియా ద్వారా తెలుసుకొన్న నిందితులు అతడిపై కాల్పులకు తెగబడ్డారు. అనంతరం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ.. ‘సల్మాన్ ఖాన్‌తో కలిసి పని చేయ్యొద్దన్న మా మాటను ముంబై సినీ పరిశ్రమలో ఎవరు వినరో, వారే మా తర్వాతి లక్ష్యం. చూస్తూ ఉండండి’ అని వారు హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

