ఆ ఏటీఎంలో రూ. 500 విత్‌డ్రా చేస్తే రూ.2,500.. బారులు తీరిన జనాలు
నాగ్‌పూర్ : ఓ వ్యక్తి నగదు విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లాడు. కానీ ఆయన కోరుకున్న నగదు కంటే ఐదు రెట్లు అధికంగా నగదు విత్ డ్రా అయింది. దీంతో ఆశ్చర్యపోయిన సదరు వ్యక్తి.. మళ్లీ అదే ప్రయత్నం చేశాడు. మళ్లీ ఐదు రెట్లు అధికంగా నగదు వచ్చింది. ఈ విషయం జనాలకు తెలియడంతో.. ఆ ఏటీఎం వద్ద నగదు విత్ డ్రా చేసుకునేందుకు బారులు తీరారు.
మహారాష్ట్ర నాగ్‌పూర్ జిల్లాలోని ఖపర్ఖేడా పట్టణంలోని ఓ ఏటీఎం వద్దకు నగదు విత్ డ్రా చేసుకునేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. అతనికి రూ. 500 అవసరం ఉండటంతో.. అంతే నగదు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ రూ. 500లకు బదులుగా రూ. 2,500 వచ్చాయి. మళ్లీ రూ. 500 విత్ డ్రా చేశాడు. మళ్లీ రూ. 2,500 వచ్చాయి. ఈ విషయాన్ని ఆ వ్యక్తి అక్కడున్న వారికి చెప్పడంతో క్షణాల్లోనే వందల మంది ఏటీఎం వద్ద గుమిగూడారు. నగదు విత్ డ్రా చేసుకునేందుకు బారులు తీరారు.
ఈ విషయం పోలీసులకు చేరడంతో.. హుటాహుటిన ఆ ఏటీఎం వద్దకు చేరుకున్నారు. ఏటీఎంను మూసివేయించారు. బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు పోలీసులు. సాంకేతిక సమస్యల కారణంగానే విత్ డ్రా చేసిన నగదు కంటే ఎక్కువగా వస్తుందని బ్యాంకు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ATM cash
- Maharashtra
- Nagpur
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

