మబ్బు తునక కానరాక.. సముద్రాల ప్రకోపం!
రెండు మహాసముద్రాలు పలు ప్రపంచ దేశాల్లో కోట్ల మందిని అతలాకుతలం చేస్తున్నాయి. ఒకటి అట్లాంటిక్ మహా సముద్రం కాగా, రెండోది పసిఫిక్ మహాసముద్రం. కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రెండు మహాసముద్రాలు వాతావరణంలో మార్పులకు కారణమవుతున్నాయి. వేడెక్కుతున్న అట్లాంటిక్ మహాసముద్రం కారణంగా ఐరోపా, ఉత్తర అమెరికా ఖండాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతన్నాయి.
- 17 ఏండ్లలో అత్యంత బలహీన నైరుతి ఆరంభమిదే
- సాధారణం కంటే 42% తక్కువగా జూన్ వర్షపాతం
- 166 ప్రధాన రిజర్వాయర్లలో 25 శాతమే నీటి నిల్వ!
- ప్రపంచ దేశాలు అతలాకుతలం
- వేడెక్కుతున్న అట్లాంటిక్.. పసిఫిక్‌లో ఎల్‌నినో
- ఐరోపా, ఉత్తర అమెరికాలో అధిక ఉష్ణోగ్రతలు
- వర్షాభావంతో భారత ఉప ఖండంలో కరువు!
న్యూఢిల్లీ, జూన్ 29 : రెండు మహాసముద్రాలు పలు ప్రపంచ దేశాల్లో కోట్ల మందిని అతలాకుతలం చేస్తున్నాయి. ఒకటి అట్లాంటిక్ మహా సముద్రం కాగా, రెండోది పసిఫిక్ మహాసముద్రం. కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రెండు మహాసముద్రాలు వాతావరణంలో మార్పులకు కారణమవుతున్నాయి. వేడెక్కుతున్న అట్లాంటిక్ మహాసముద్రం కారణంగా ఐరోపా, ఉత్తర అమెరికా ఖండాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతన్నాయి. మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నినో కారణంగా భారతదేశంలో నైరుతి రుతుపవనాలకు అవాంతరం ఏర్పడుతున్నది. దీంతో దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్టి కరువు పరిస్థితులకు దారితీస్తున్నది. దీంతో న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ వరకు విస్తరించిన ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులకు ఈ రెండు మహాసముద్రాలు కారణమవుతున్నాయి.
ఉష్ణ గుమ్మటాలు బలపడే చాన్స్
వేడెక్కుతున్న అట్లాంటిక్ మహాసముద్రం కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఐరోపా ఖండంలో వడగాలులు వీయడమే కాకుండా స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. ఈ వాతావరణ ధోరణి పశ్చిమ దిశగా విస్తరిస్తున్నదని, దీంతో ఉష్ణ గుమ్మటాలు బలపడి అమెరికాలో సైతం రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిరంతరం అధిక వాతావరణ పీడనం ఉండే ప్రాంతంలో భూ ఉపరితలం దగ్గర వేడి గాలులను బంధించినప్పుడు ఉష్ణగుమ్మటం ఏర్పడుతుందని వారు వివరించారు. ఆ సమయంలో దిగువకు వీచే గాలి సంకోచించి వేడెక్కుతుందని, అదే సమయంలో ఆకాశం నిర్మలంగా మారడంతో సూర్యరశ్మి నేలను దహించి వేస్తుందని తెలిపారు.

వందల కోట్ల మంది ప్రభావితం..
పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్ నినో కారణంగా ఉష్ణమండల ప్రాంతా ల్లో వాతావరణ ప్రసరణ మారిపోతున్నది. దీనివల్ల సాధారణంగా అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి భారత ఉపఖండంలోకి తేమను తీసుకొచ్చే రుతుపవన గాలులు బలహీనపడుతున్నాయని వివరించారు. ఇప్పటికే ఆలస్యమైన రుతుపవనాలు, ఇంకా నెమ్మదిగా కదులుతుండటంతో జూన్ నెలలో 42% లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. రుతుపవనాలు ఇంకా కనుమరుగు కాలేదని, కానీ వాటి వేగం తగ్గిపోయిందని అంటున్నారు. ఎల్ నినో కారణంగా భూమధ్యరేఖను దాటి వీచే గాలులు తగ్గిపోయాయని, దీంతో మేఘాలు ఏర్పడటం లేదని ఫలితంగా వాతావరణంలో వర్షాలను కురిపించే వ్యవస్థలు ముందుకు సాగడం లేదని తెలిపారు. ఈ ప్రభావంతో దేశంలో రిజర్వాయర్లలో నీటిమట్టం పడిపోతున్నదని, ఢిల్లీ వంటి ఉత్తర భారత నగరాలు అధికకాలం వడగాలులను ఎదుర్కొంటున్నాయని వివరించారు. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఆ రెండూ వేడెక్కుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తున్నాయని అంటున్నారు. పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు వాతావరణంతో జరిగే ఉష్ణ, తేమ వినిమయాల పరిమాణాన్ని పెంచి, ఇప్పటికే తీవ్రంగా ఉన్న వాతావరణ సరళిని తీవ్రతరం చేస్తున్నాయని వివరించారు. దీంతో ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికాలోని వందల కోట్ల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

