Atishi’s luggage thrown out | ఢిల్లీ సీఎం అతిషి నివాసం నుంచి సామగ్రి తొలగింపు.. ఎల్జీపై ఆప్ ఆరోపణలు
Atishi's luggage thrown out | దేశ రాజధానిలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు, ఢిల్లీ సీఎం అతిషి సామగ్రిని ఆమె అధికార నివాసం నుంచి తొలగించారు. పలు వాహనాల్లో ఆ ఇంటి నుంచి పంపివేశారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశం మేరకు అధికారులు ఈ చర్యకు పాల్పడినట్లు సీఎంవో కార్యాలయం, ఆప్ నేతలు ఆరోపించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు, ఢిల్లీ సీఎం అతిషి సామగ్రిని ఆమె అధికార నివాసం నుంచి తొలగించారు. (Atishi’s luggage thrown out) పలు వాహనాల్లో ఆ ఇంటి నుంచి పంపివేశారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశం మేరకు అధికారులు ఈ చర్యకు పాల్పడినట్లు సీఎంవో కార్యాలయం, ఆప్ నేతలు ఆరోపించారు. ఆప్ చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖాళీ చేసిన ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ 6లోని అధికార నివాసంలోకి ఢిల్లీ సీఎం అతిషి సోమవారం మారారు. అయితే బుధవారం సీఎం అధికార నివాసం నుంచి అతిషికి సంబంధించిన లగేజ్‌ను పీడబ్ల్యూడీ అధికారులు తొలగించారు. ఆ నివాసం మెయిన్ డోర్‌కు మరో లాక్ వేశారు. ఆ బంగ్లా తాళాలను కేజ్రీవాల్ అప్పగించలేదని ఆరోపించారు.
కాగా, ఈ చర్యపై సీఎం కార్యాలయం (సీఎంవో) స్పందించింది. ‘దేశ చరిత్రలో తొలిసారి ముఖ్యమంత్రి నివాసాన్ని బలవంతంగా ఖాళీ చేయించారు. బీజేపీ పిలుపు మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశంతో సీఎం నివాసం నుంచి అతిషి వస్తువులను తొలగించారు’ అని సీఎంవో ఆరోపించింది. బీజేపీ ముఖ్య నేతకు ఆ బంగ్లా కేటాయించడం సీఎం అతిషిని బలవంతంగా ఖాళీ చేయించినట్లు ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు.
మరోవైపు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఈ పరిణామంపై స్పందించారు. ఆ నివాసానికి ఎట్టకేలకు సీలు వేశారని అన్నారు. ‘ఎట్టకేలకు అరవింద్ కేజ్రీవాల్ ‘షీష్ మహల్’కు సీల్ పడింది. సంబంధిత శాఖకు తాళాలు ఇవ్వకుండా మళ్లీ ఆ బంగ్లాలోకి అడుగుపెట్టేందుకు మీరు ప్రయత్నించారు. ఆ బంగ్లాలో ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయి? అని వీడియో సందేశంలో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- Atishi
- CM home
- Lt. Governor
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

