సిద్ధూ బల ప్రదర్శన.. 62 మంది ఎమ్మెల్యేలతో భేటీ

అమృత్సర్: పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలు మరింత తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తున్నది. తనకు మద్దతుగా ఉన్న 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సిద్ధూ బుధవారం అమృత్‌సర్‌లోని తన నివాసంలో అల్పాహారానికి ఆహ్వానించారు. వారితో భేటీ అనంతరం అంతా కలిసి ఒక బస్సులో గోల్డెన్ టెంపుల్‌తోపాటు పలు ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు.

ఈ సందర్భంగా సిద్ధూకు అనుకూలంగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. సిద్ధూ క్షమాపణ చెప్పాలన్న సీఎం అమరీందర్ సింగ్ సలహాదారుడి ట్వీట్‌ను కాంగ్రెస్ జలందర్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రగత్ సింగ్ ఖండించారు. సిద్ధూ ఎందుకు క్షమాపణ చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు. చాలా సమస్యలు పరిష్కరించని సీఎం అమరీందర్ సింగ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. సీఎంను ఆయన సలహాదారుడు తప్పుదారి పట్టిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు విమర్శించారు. వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ నేతృత్వంలో పార్టీ తప్పక విజయం సాధిస్తుందని కొందరు ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maatrubhumi Trailer: మాతృభూమి ట్రైలర్ రిలీజ్ చేసిన సల్మాన్ ఖాన్
KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం
Train Derail | అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు..!
Toxic | ‘టాక్సిక్’ వివాదంలో కియారా అద్వానీకి భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అండ.. ట్రోలర్లకు గట్టి సమాధానం!
Hyderabad Accident | రాంగ్ రూట్లో వచ్చిన ఎస్బీఐ ఉద్యోగి.. బస్సు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

