ఎమ్మెల్యే సుశాంత బోర్గోహైన్ రాజీనామా.. షోకాజ్ నోటీసు ఇచ్చిన కాంగ్రెస్
సుశాంత బోర్గోహైన్ | అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సుశాంత బోర్గోహైన్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నిన్న రాజీనామా చేశారు.

గౌవహాతి : అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సుశాంత బోర్గోహైన్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నిన్న రాజీనామా చేశారు. ఈ పరిణామంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా స్పందించింది. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో స్పష్టంగా చెప్పాలంటూ ఇవాళ ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూపేశ్ భోరా సుశాంత బోర్గోహైన్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అతడిపై న్యాయ పరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు భోరా తెలిపారు. సుశాంత బోర్గోహైన్ ఎగువ అస్సాంలోని థౌరా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కాంగ్రెస్‌ను వీడటం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సుశాంత రాజీనామాను అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) కార్యాదర్శి అపుర్బ కుమార్ ఈ ఉదయం ఆమోదించిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టీఏజీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ
RS Praveen Kumar | హైదరాబాద్‌లో టెర్రర్ అటాక్స్ ఉన్నాయనే కాన్ఫిడెన్షియల్ మెసేజ్ సోషల్ మీడియాలోకి ఎలా వెళ్లింది?
Sheikh Hasina | చేతులకు సంకెళ్లతో మాత్రమే స్వదేశానికి షేక్ హసీనా : బంగ్లాదేశ్
Boat Missing | ఏడుగురు మత్స్యకారుల బోటు గల్లంతు..కుటుంబ సభ్యుల్లో ఆందోళన
Dhanush | 2027 స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ధనుష్ వ్యూహం.. రాష్ట్రవ్యాప్తంగా సేవా విభాగాల బలోపేతం
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

