రగులుతున్న అస్సాం,మేఘాలయ
అస్సాం, మేఘాలయ సరిహద్దు ప్రాంతంలో మంగళవారం చెలరేగిన హింస బుధవారం కూడా కొనసాగింది.
- అస్సాంలో అటవీ కార్యాలయానికి నిప్పు
- మేఘాలయలో వాహనాలకు మంటలు
గువాహటి/న్యూఢిల్లీ, నవంబర్ 23: అస్సాం, మేఘాలయ సరిహద్దు ప్రాంతంలో మంగళవారం చెలరేగిన హింస బుధవారం కూడా కొనసాగింది. అస్సాంలోని ఆంగ్లాంగ్ జిల్లాలో ఉన్న అటవీ కార్యాలయంపై మేఘాలయ వాసులు దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. ఇదే సమయంలో మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఒక వాహనానికి, ముక్రోహ్‌లో మరో వాహనానికి గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు.
వీరు అస్సాంకు చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇరు రాష్ర్టాల మధ్య ఉన్న 12 వివాదాస్పద ప్రాంతాలపై ఇరువురికి తరుచుగా గొడవులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల 6 ప్రాంతాలపై ఇరు రాష్ర్టాల సీఎంలు ఒప్పందం చేసుకున్నారు. మిగతా 6 ప్రాంతాలపై ఒప్పందానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఇరు రాష్ర్టాల మధ్య గొడవలు మాత్రం ఆగడం లేదు. మరోవైపు సరిహద్దులో స్థానికుల మధ్య చిన్నచిన్న గొడవులు జరిగాయని, అది పెద్ద విషయం కాదని అస్సాం సీఎం హిమంత చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

