Himanta Biswa Sarma | సీఎం పదవికి హిమాంత రాజీనామా.. మే 11న మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం
Himanta Biswa Sarma | అసోం రాజకీయాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు అడుగుపడింది. ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అసోం అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి (NDA alliance) ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన కేబినెట్ సహచరులతో కలిసి గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య (Laxman Prasad Acharya) ను కలిశారు.
Himanta Biswa Sarma : అసోం రాజకీయాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు అడుగుపడింది. ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అసోం అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి (NDA alliance) ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన కేబినెట్ సహచరులతో కలిసి గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య (Laxman Prasad Acharya) ను కలిశారు. తన రాజీనామా లేఖను గవర్నర్కు అందజేయగా ఆయన దానిని ఆమోదించారు. అయితే నూతన ప్రభుత్వం కొలువుదీరేదాకా తాత్కాలిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాలని గవర్నర్ ఆయనను కోరారు.
మొత్తం 126 స్థానాలున్న అసోం అసెంబ్లీలో బీజేపీ కూటమి ఏకంగా 102 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. రాజీనామా అనంతరం లోక్భవన్ వెలుపల మీడియాతో మాట్లాడిన హిమాంత బిశ్వశర్మ, ఈ చారిత్రాత్మక విజయం తర్వాత కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం మే 11 తర్వాత ఉంటుందని వెల్లడించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర పరిశీలకుల సమక్షంలో త్వరలోనే జరగబోయే బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని అధికారికంగా ఎంపిక చేయనున్నారు. అసోంలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టబోతుండటంతో అటు పార్టీ వర్గాల్లో, ఇటు ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

