ధారావి మళ్లీ మెరిసింది : మహమ్మారిపై గెలుపు దిశగా ఆసియాలో అతిపెద్ద మురికివాడ

ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన ముంబైలోని ధారావి ఒకప్పుడు కరోనా హాట్ స్పాట్ గా మారింది. మహమ్మారి కోరల్లో నలిగిన ధారావిలో గడిచిన 24 గంటల్లో కేవలం మూడు తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని బ్రుహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వర్గాలు వెల్లడించాయి. దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్నప్పటి నుంచి ధారావిలో అతితక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
ముంబైలోనే అత్యంత ఇరుకైన ప్రాంతమైన ధారావిలో ఎనిమిది లక్షలకు పైగా జనాభా ఉంది. 6798 యాక్టివ్ కేసులకు గాను ఇప్పటికి 6382 మంది కోలుకోగా మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. విస్తారమైన జనాభా కలిగిన ధారావిలో సోమవారం 16, మంగళవారం కేవలం 7 కేసులే వెలుగుచూడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా మూడు కేసులే నమోదవడంతో మహమ్మారి తగ్గుముఖం పట్టిందని అంచనా వేస్తున్నారు.
కరోనా తొలివేవ్ దేశాన్ని వణికించిన సమయంలో ధారావిలో గత ఏడాది ఏప్రిల్ 1న తొలి కొవిడ్ కేసు నమోదవడం, తొలి మరణం చోటుచేసుకున్నాయి. మే 3న అప్పట్లో అత్యధికంగా 94 కేసులు నమోదవడంతో మురికివాడలో మహమ్మారి కట్టడి సవాల్ గా మారి బీఎంసీ అధికారులు తలలు పట్టుకున్నారు.
ఆపై స్ధానికుల సహకారం, అధికారుల చొరవతో మహమ్మారిని దీటుగా నియంత్రించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం కొవిడ్-19పై ధారావి పోరాటాన్ని కొనియాడారు. సెకండ్ వేవ్ లోనూ అదే స్ఫూర్తితో ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ కరోనా మహమ్మారిని విజయవంతంగా నిలువరించే దిశగా సాగుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

