న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో చిత్ర, విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్లు పుట్టుకొస్తుండటంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఓరియో మ్యాగీ నుంచి చాక్లెట్ ఆమ్లెట్ వరకూ ఎన్నో వినూత్న ఫుడ్ కాంబినేషన్లు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇక నటుడు ఆశిష్ విద్యార్ధి కోల్‌కతా రస్గుల్లా ఛాయ్‌ను ఎంజాయ్ చేస్తున్న వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది యూనిక్ ఛాయ్ అంటూ ఆయన ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా నెటిజన్లు మాత్రం ఇదేం ఛాయ్ అంటూ పెదవివిరిచారు. కోల్‌కతా టూర్లో భాగంగా ఆయన రస్గుల్లా ఛాయ్ బాగుందని కితాబివ్వగా నెటిజన్లు మాత్రం భిన్నంగా రియాక్టయ్యారు. ఈ షార్ట్ క్లిప్‌లో కోల్‌కతాలోని చుముకె చమోక్ ఈటరీ వద్ద ఆశిష్ విద్యార్ధి రస్గుల్లా ఛాయ్ తాగుతూ కనిపిస్తారు.
ఇక టీ విక్రేత ఛాయ్‌లో కొన్ని దినుసులు, రస్గుల్లా ముక్క వేయడం కనిపిస్తుంది. ఆపై టీ టేస్ట్ చేసిన తర్వాత ఇది వినూత్నంగా ఉందని చెబుతాడు. టీలో బ్రెడ్ ముంచుకుని తాగినట్టుగా ఉందని అంటాడు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి 4 లక్షల మంది వీక్షించారు. అయితే తేనీటి ప్రియులు మాత్రం ఈ ఛాయ్‌పై పెదవివిరిచారు. మాఫ్ కర్ధో ప్లీజ్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, కుచ్ భీ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :