ASEAN-India Summit | 2022 ఆసియాన్ దేశాలు-భారత్ ఐక్యత సంవత్సరం : మోదీ
ASEAN-India Summit | వచ్చే ఏడాదితో ఆసియాన్ దేశాల భాగస్వామ్యానికి 30 సంవత్సరాలవుతాయని, ఈ భాగస్వామ్యానికి గుర్తుగా 2022ను ఐక్యతా సంవత్సరంగా

న్యూఢిల్లీ : వచ్చే ఏడాదితో ఆసియాన్ దేశాల భాగస్వామ్యానికి 30 సంవత్సరాలవుతాయని, ఈ భాగస్వామ్యానికి గుర్తుగా 2022ను ఐక్యతా సంవత్సరంగా జరుపుకుందామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని గురువారం 18వ ఆసియాన్- ఇండియా సమ్మిట్‌లో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియన్ దేశాలతో భారత్‌కు సుదీర్ఘ సంబంధాలున్నాయని చెప్పారు.
ప్రపంచం ఇంకా కరోనాతో పోరాడుతుందని, మహమ్మారి కాలంలో భారత్ కూడా అనేక సవాళ్లను ఎదుర్కొందని పేర్కొన్నారు. కొవిడ్ ప్రభావం ఆసియాన్ దేశాలు-భారత్ మధ్య స్నేహానికి సవాల్‌గా మారిందన్నారు. ఈ సమయంలో పరస్పర సహకారంతోనే బంధం బలోపేతం చేయగలమన్నారు. ఆసియాన్ దేశాలతో స్నేహమే భారత్‌కు ప్రధానం అని స్పష్టం చేశారు. 2022 నాటికి ఆసియన్ దేశాల భాగస్వామ్యానికి 30 సంవత్సరాలు, భారత్‌కు కూడా స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతాయన్నారు.
ఈ ముఖ్యమైన మైలురాయికి గుర్తుగా ‘ఆసియాన్ – భారత్ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుందామన్న మోదీ.. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. 18వ ఆసియాన్- భారత్ సమ్మిట్ కరోనా మహమ్మారి, అంతర్జాతీయ అభివృద్ధి, వ్యాపారాలు, ఇతర సమస్యలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమీక్షిస్తుంది. ఆరోగ్యం, వాణిజ్యం, కనెక్టివిటీ, విద్య సంస్కృతి సహా కీలక రంగాల్లో సాధించిన పురోగతిపై చర్చించనున్నది.
నేడు విదేశీయాత్రకు ప్రధాని
నేటి నుంచి ఐదు రోజుల పాటు ప్రధాని పలు దేశాల్లో పర్యటించనున్నారు. ఇటలీ, బ్రిటన్‌లో ఐదు రోజుల పర్యటన నిమిత్తం మంత్రి నరేంద్ర మోదీ గురువారం బయలుదేరనున్నారు. పర్యటనలో ఆయన జీ-20 సదస్సులో పాల్గొంటారు. అక్టోబరు 30 నుంచి ఇటలీలో రెండు రోజుల సదస్సు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత యూకేలోని గ్లాస్గో పర్యటనకు వెళ్లనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robert Pattinson | కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ పాటిన్సన్.. అధికారికంగా ప్రకటించిన అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్
PM Modi: మనీలాలో గురుద్వార ఖల్సాను సందర్శించిన ప్రధాని మోదీ
OM | ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాయి పల్లవి, శ్రీలీల స్పెషల్ డ్యాన్స్.. మమ్ముట్టి ప్రశంసలు,ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
US Banking Outage | మొన్న మైక్రోసాఫ్ట్.. నిన్న ఎయిర్‌లైన్స్.. నేడు బ్యాంకులు.. అమెరికాను వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు!
Uttarakhand: 100 మీటర్ల లోయలో పడిన బస్సు.. ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

