డ్రాగన్ దాడిని మోదీ ఎన్నటికీ అంగీకరించరు : కేంద్ర ప్రభుత్వంపై అసదుద్దీన్ ఓవైసీ ఫైర్
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వద్ద డిసెంబర్ 9న భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ వ్యవహారం వెలుగుచూసిన అనంతరం బీజేపీ ప్రభుత్వంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు.
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వద్ద డిసెంబర్ 9న భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ వ్యవహారం వెలుగుచూసిన అనంతరం బీజేపీ ప్రభుత్వంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. చైనా గత అనుభవాల నుంచి నేర్చుకుందని ప్రధాని చైనా దాడి విషయాన్ని ఎప్పటికీ అంగీకరించరని దుయ్యబట్టారు. భారత భూభాగంపై చైనా దాడి విషయంలో ప్రధాని మోదీ తన మీడియా ద్వారా విభిన్న స్టోరీ వినిపిస్తారని ఎద్దేవా చేశారు.
2022 ఆగస్ట్‌లో చైనా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో దళాలను 75 శాతం పెంచిందని ఓవైసీ పేర్కొన్నారు. డోక్లాం, దెసాంగ్, గల్వాన్, డెమ్‌చోక్‌ల్లో అనుభవాల నుంచి చైనా నేర్చుకుందని, కానీ ప్రధాని మోదీ మాత్రం ఈ దాడిని ఎన్నటికీ అంగీకరించరని, పైగా తన మీడియా స్నేహితుల ద్వారా డ్రాగన్ దాడికి భిన్న భాష్యాలు చెబుతారని ఓవైసీ ట్వీట్ చేశారు. తవాంగ్ సెక్టార్లో చైనా, భారత్ సైనికుల ముఖాముఖి తలపడిన ఘటనలో ఇరు దేశాల సైనికులకు గాయాలయ్యాయని భారత సైన్యం ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా చైనా దాడిపై తాను వాయిదా తీర్మానం ప్రవేశపెడతానని ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్ బలగాలను ఎందుకు తగినంతగా మోహరించలేదని ఓవైసీ ప్రశ్నించారు. డోక్లాం, లడఖ్‌లో గతంలో డ్రాగన దుందుడుకు చర్యల అనుభవాల నేపధ్యంలోనూ మన బలగాలను అరుణాచల్ ప్రదేశ్‌లో ఎందుకు అధిక సంఖ్యలో మోహరించేలా చర్యలు చేపట్టలేదని మోదీ సర్కార్‌ను నిలదీశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

