న్యూఢిల్లీ: జైళ్లు తనను బలహీనం చేయలేవని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. తన నైతికత వంద రెట్లు పెరిగిందని చెప్పారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో తీహార్ జైలు నుంచి శుక్రవారం ఆయన విడుదలయ్యారు. భారీ వర్షంలో తడుస్తూ తన విడుదల కోసం ఎదురుచూసిన ఆప్ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. ‘మీరందరూ వర్షంలో ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడకు వచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. నా జీవితం దేశం కోసం అంకితం చేశా. నేను చాలా కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్నా. కానీ దేవుడు నాతో ఉన్నాడు. ఎందుకంటే నేను సత్య మార్గంలో నడిచా’ అని అన్నారు.
కాగా, అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా బీజేపీపై పరోక్షంగా మండిపడ్డారు. ‘ఈ వ్యక్తులు నన్ను జైలులో పెట్టారు. నా నైతికతను విచ్ఛిన్నం చేయాలని భావించారు. అయితే జైళ్లు నన్ను బలహీనపరచలేవు. నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నా నైతికత, నా బలం వంద రెట్లు పెరిగాయి. దేవుడు నాకు చూపిన మార్గంలో నడుస్తా. దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటా’ అని అన్నారు.
#WATCH | Delhi CM Arvind Kejriwal says, “The prison walls have increased my courage 100 times. My life is dedicated to the country. Every drop of my blood is dedicated to my country. God has always supported me. Why did God support me? Because I was truthful, I was right, I… pic.twitter.com/ohAb0uTQ0K
— ANI (@ANI) September 13, 2024
#WATCH | Delhi CM Arvind Kejriwal says, “I express my gratitude to the countrymen who prayed for my release. Some people in the country, anti-national forces want to weaken the country, want to divide the country. Today judges are being threatened. Attempts are being made to… pic.twitter.com/1KLZuFz82x
— ANI (@ANI) September 13, 2024