కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 8.72 లక్షల పోస్టులు ఖాళీ

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 2020 మార్చి 1 నాటికి 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. కేంద్రంలోని అన్ని శాఖల్లో మంజూరైన పోస్టులు గతేడాది మార్చికి 40,04,941గా ఉన్నట్టు తెలిపారు. 2020 మార్చి 1 నాటికి 31,32,698 మంది విధుల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తం 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు గురువారం రాజ్యసభలో ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గడిచిన ఐదేండ్లలో మూడు ప్రధాన ఏజెన్సీల ద్వారా కొన్ని నియామకాలు చేపట్టినట్టు తెలిపారు. 2016-17 నుంచి 2020-21 వరకు యూపీఎస్సీ ద్వారా 25,267 పోస్టులు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 2,14,601 పోస్టులు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 2,04,945 పోస్టులు భర్తీచేసినట్టు ఆయన వెల్లడించారు. రిజర్వేషన్ క్యాటగిరీలవారీగా ఎస్సీ విభాగంలో 14,366, ఎస్టీలో 12,612, ఓబీసీలో 15,088 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించారు.
ఉన్నతవిద్యా సంస్థల్లోనూ..
తాము అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2014లో ప్రధాని మోదీ ప్రకటించారు. వాస్తవానికి ఆ పరిస్థితులు కనబడటంలేదు. కేంద్రప్రభుత్వంలోని వివిధ శాఖల్లో భర్తీచేయని పోస్టుల సంఖ్య గత ఐదేండ్లలో రెట్టింపు అయింది. కేంద్ర ఆర్థిక శాఖ కింద పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మంజూరైనప్పటికీ కేంద్రప్రభుత్వ శాఖల్లో భర్తీచేయని పోస్టులు 11.57 శాతంగా (4,21,658 పోస్టులు) ఉంటే, 2019-20 నాటికి 21.77 శాతానికి (8,72,243 పోస్టులు) చేరింది. కేంద్రవిశ్వవిద్యాలయాలు, ఐఐటీ/ఐఐఎం, కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఉన్నతవిద్యా సంస్థల్లో దాదాపు 37 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

