Army jawan | భార్యతో సహోద్యోగి వివాహేతర సంబంధం.. అతడి భార్యను హత్య చేసిన ఆర్మీ జవాన్
Army jawan | ఈ నెల 13న ఆ జవాన్ (Army jawan) ఇంటికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో సేనాపతి ఇంట్లో లేడు. దీంతో సేనాపతి గురించి అతడి భార్య సుధేష్ణను అడిగాడు. ఫోన్ చేసి అతడ్ని పిలువాలని చెప్పాడు. అలాగే తన భార్య, సేనాపతి మధ్య అక్రమ సంబంధం ఉందని ఆరోపించాడు.
లక్నో: భార్యతో వివాహేతర సంబంధం ఉన్న సహోద్యోగిపై ఒక ఆర్మీ జవాన్ (Army jawan) రగిలిపోయాడు. అతడి భార్యను హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆర్మీ జవాన్ మనోజ్ సేనాపతితో తన భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు మరో ఆర్మీ జవాన్ నితీశ్ పాండే తెలుసుకున్నాడు. దీంతో సహోద్యోగి అయిన సేనాపతిపై రగిలిపోయాడు. ఈ నెల 13న ఆ జవాన్ ఇంటికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో సేనాపతి ఇంట్లో లేడు. దీంతో సేనాపతి గురించి అతడి భార్య సుధేష్ణను అడిగాడు. ఫోన్ చేసి అతడ్ని పిలువాలని చెప్పాడు. అలాగే తన భార్య, సేనాపతి మధ్య అక్రమ సంబంధం ఉందని ఆరోపించాడు. అతడి మొబైల్ ఫోన్లో ఉన్న తన భార్య ఫొటోలు, వీడియోలు తొలగించాలని సేనాపతితో చెప్పాలన్నాడు.
కాగా, ఈ సందర్భంగా సేనపతి భార్య సుధేష్ణ, నితీశ్ పాండే మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన అతడు తన వెంట తెచ్చిన సైనికులు వినియోగించే కత్తితో ఆమెపై దాడి చేశాడు. మెడ, ఇతర శరీర భాగాలపై కత్తి గాయాలు కావడంతో ఆమె మరణించింది. అనంతరం నితీశ్ పాండే అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు ఆర్మీ జవాన్ మనోజ్ సేనాపతి భార్య సుధేష్ణ హత్య గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడైన మరో జవాన్ నితీశ్ పాండేను గుర్తించారు. మిలటరీ పోలీసుల సహాయంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు దాచిన హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
horrifying incident | కత్తితో గొంతు కోసుకుని.. పోలీస్ నుంచి పిస్టల్ లాక్కొని కాల్పులు జరిపిన వ్యక్తి
Mysore highway | నీట మునిగిన బెంగళూరు-మైసూరు హైవే.. మోదీ ప్రారంభించిన వారం రోజులకే ఇలా..! వాహనదారుల ఆగ్రహం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

