Shrikant Purohit | కల్నల్ శ్రీకాంత్ పురోహిత్‌కు బ్రిగేడియర్ హోదా.. ఆమోదం తెలిపిన భారత సైన్యం
Shrikant Purohit | లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్ (Lt Col Shrikant Purohit) కు బ్రిగేడియర్ (Brigadier) గా పదోన్నతి కల్పించేందుకు భారత సైన్యం (Indian Army) ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలేగావ్ బాంబు పేలుళ్ల (Malegaon blast) కేసులో శ్రీకాంత్ పురోహిత్ కూడా అభియోగాలు ఎదుర్కొన్నారు.
Shrikant Purohit : లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్ (Lt Col Shrikant Purohit) కు బ్రిగేడియర్ (Brigadier) గా పదోన్నతి కల్పించేందుకు భారత సైన్యం (Indian Army) ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలేగావ్ బాంబు పేలుళ్ల (Malegaon blast) కేసులో శ్రీకాంత్ పురోహిత్ కూడా అభియోగాలు ఎదుర్కొన్నారు. అయితే ముంబైలోని ప్రత్యేక కోర్టు గత ఏడాది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.
పదోన్నతి పదవీకాల ప్రయోజనాలను కోరుతూ కల్నల్ సాయుధ దళాల ట్రిబ్యునల్ (AFT) లో పిటిషన్ దాఖలు చేశారు. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు విచారణ సుదీర్ఘకాలం సాగడంవల్ల తన వృత్తిపరమైన పురోగతిపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 31న జరగాల్సిన కల్నల్ పదవీ విరమణపై ఏఎఫ్‌టీ స్టే విధించింది. ఈ క్రమంలో రక్షణశాఖకు నోటీసులు జారీచేసింది. కల్నల్ చేసిన చట్టబద్ధమైన ఫిర్యాదుపై నిర్ణయం తీసుకునేంత వరకు అతడి పదవీ విరమణను ఆపేయాలని అందులో పేర్కొన్నది.
ఈ క్రమంలోనే శ్రీకాంత్ పురోహిత్‌కు పదోన్నతి కల్పిస్తూ భారత సైన్యం నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలో 2008 సెప్టెంబర్ 29న పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనలో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్ సహా మొత్తం ఏడుగురిపై కేసు నమోదైంది. గత ఏడాది ఈ కేసుపై విచారణ జరిపిన ఎన్ఐఏ కోర్టు అభియోగాలు ఎదుర్కొంటున్న అందరినీ నిర్దోషులుగా తేల్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

