Arabinda Dhali | ఒడిశాలో అధికార బీజేడీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మరో ఎమ్మెల్యే
Arabinda Dhali | పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్న ఒడిశాలో అధికార బీజేడీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా ప్రతిపక్ష బీజేపీలోకి జారుకుంటున్నారు. తాజాగా బీజేడీ సీనియర్ నేత, ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన అరబింద ధాలి బీజేడీకి షాకిచ్చారు. శనివారం ఉదయం ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
Arabinda Dhali: పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్న ఒడిశాలో అధికార బీజేడీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా ప్రతిపక్ష బీజేపీలోకి జారుకుంటున్నారు. తాజాగా బీజేడీ సీనియర్ నేత, ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన అరబింద ధాలి బీజేడీకి షాకిచ్చారు. శనివారం ఉదయం ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
ప్రస్తుతం అరబింద ధాలి కోరాధా జిల్లాలోని జయదేవ్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ధాలి తన రాజీనామా పత్రాన్ని బీజేడీ అధ్యక్షుడు, సీఎం నవీన్ పట్నాయక్‌కు ఈ-మెయిల్ ద్వారా పంపారు. అయితే ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలను వెల్లడించలేదు. ధాలి మొదటిసారి 1992లో బీజేపీ టికెట్‌పై మల్కాక్గిరి ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆ తర్వాత రెండు పర్యాయాలు ఆ స్థానం నుంచే ఎమ్మెల్యేగా ధాలి విజయం సాధించారు. అనంతరం ఆయన బీజేడీలో చేరారు. 2009లో జయదేవ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2019లో కూడా ఇదే నియోజకవర్గంలో బీజేడీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందారు. నవీన్ పట్నాయక్ కేబినెట్లో ధాలి రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.
గత నెల బీజేడీ నుంచి బహిష్కరణకు గురైన ఇద్దరు ఎమ్మెల్యేలు పాణిగ్రాహి, ప్రశాంత్ జగదేవ్ ప్రతిపక్ష బీజేపీలో చేరారు. రాష్ట్ర మాజీ మంత్రి దేబాసిస్ నాయక్ కూడా ఇటీవల బీజేడీ నుంచి బయటికి వచ్చారు. ఎన్నికల వేళ ఈ పరిణామాలు అధికార బీజేడీకి తలనొప్పిగా మారాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
Telugu University | ఏపీ ఎమ్మెల్యేకు తెలంగాణ పురస్కారం..! వివాదాస్పదంగా మారిన తెలుగు యూనివర్సిటీ నిర్ణయం
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

