అనుమతులు ఇచ్చిన డీసీజీఐ
హైదరాబాద్: కార్బివ్యాక్స్ టీకాను బూస్టర్ డోసుగా వేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులు ఇచ్చిందని హైదరాబాద్ ఫార్మా సంస్థ బయలాజికల్-ఈ వెల్లడించింది. కొవాగ్జిన్ కానీ కొవిషీల్డ్ కానీ రెండు డోసులు వేసుకున్నాక ఆర్నెల్ల తర్వాత కార్బివ్యాక్స్ను బూస్టర్ డోసుగా వేసుకోవచ్చని పేర్కొన్నది.
18 ఏండ్లు నిండిన వారు ఈ వ్యాక్సిన్ వేసుకునేందుకు అర్హులని తెలిపింది. బయలాజికల్-ఈ ఇటీవల క్లినికల్ ట్రయల్స్ డాటాను డీసీజీఐకి సమర్పించగా అనుమతులు ఇచ్చిందని సంస్థ తెలిపింది.