Apple Watch | అలల తాకిడికి కొట్టుకుపోయి యాపిల్ వాచ్ అల్ట్రా సాయంతో బయటపడ్డాడు
Apple Watch : అలల తాకిడితో విలవిలలాడిన వ్యక్తి నట్టనడి సంద్రం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. సముద్రంలో చిక్కుకుపోయిన ఓ వ్యక్తి ప్రాణాలను యాపిల్ వాచ్ అల్ట్రా కాపాడింది.
Apple Watch : అలల తాకిడితో విలవిలలాడిన వ్యక్తి నట్టనడి సంద్రం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. సముద్రంలో చిక్కుకుపోయిన ఓ వ్యక్తి ప్రాణాలను యాపిల్ వాచ్ అల్ట్రా కాపాడింది. ఆస్ట్రేలియాలోని బైరన్ బే తీరంలోని టాలో బీచ్‌లో సర్ఫింగ్‌కు వెళ్లిన స్విమ్మర్ అనూహ్యంగా సముద్రం పోటెత్తడంతో ప్రమాదకర జోన్లోకి కొట్టుకుపోయాడు. సముద్ర గర్భంలోని డేంజర్ జోన్ నుంచి ప్రాణాలతో తిరిగి తీరంలోకి రావడం దాదాపు అసాధ్యమనే దశకు చేరిపోయాడు.
స్విమ్మింగ్‌లో తనకు అపార అనుభవం ఉన్నా ఊహించని విధంగా తన తలపై నుంచి భారీ అలలు వెళ్లడంతో ప్రాణాలు బిగపట్టుకుని నీటిలోపల ఉండాల్సి వచ్చిందని స్విమ్మర్, సర్ఫర్ షియర్మన్ గుర్తుచేసుకున్నాడు. 20 నిమిషాల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపిన అనంతరం పరిస్ధితి తీవ్రతను గుర్తించిన షియర్మన్ తక్షణ సాయం కోసం అర్ధించాలని నిర్ణయానికి వచ్చాడు.
అదృష్టవశాత్తూ తన యాపిల్ వాచ్ అల్ట్రాలో బిల్టిన్ సెల్యులార్ కనెక్షన్ ఫీచర్ ఉండటంతో తన ప్రాణం లేచివచ్చిందని, సముద్ర గర్భం నుంచే నేరుగా ఆస్ట్రేలియన్ ఎమర్జెన్సీ సర్వేసెస్‌కు కాల్ చేసి తన పరిస్ధితి వివరించానని షియర్మన్ గుర్తుచేసుకున్నాడు. భారీ అలలు, గాలి, శబ్ధాల మధ్యే దాదాపు గంట పాటు ఎమర్జెన్సీ సిబ్బంది చేరుకునేవరకూ షియర్మన్ అధికారులతో కాంటాక్ట్‌లో ఉన్నాడు. టెక్నాలజీ తన ప్రాణాలు కాపాడటం అద్భుతమని షియర్మన్ చెప్పుకొచ్చాడు. యాపిల్ వాచ్ అల్ట్రాతో తాను క్షేమంగా బయటపడగలిగానని పేర్కొన్నాడు.
Read More :
Jagapathi Babu | క్యాసినో ఆడుతూ నాకు సిగ్గు లేదని పోస్ట్ పెట్టిన జగపతిబాబు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Apple Watch Ultra
- MAN
- Rescue
- sea
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

