బాలుడి ప్రాణం కాపాడిన యాపిల్‌వాచ్
యాపిల్‌వాచ్ మరో ప్రాణం కాపాడింది. 150 అడుగుల లోయలో పడిపోయిన బాలుడి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసి, ఊపిరి ఆగకుండా చూసింది. మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు చెందిన స్మిత్ మేథా (17) తన స్నేహితులతో కలిసి ముంబై సమీపంలోని లోనావాలకు సందర్శనకు వెళ్లాడు.
పుణె: యాపిల్‌వాచ్ మరో ప్రాణం కాపాడింది. 150 అడుగుల లోయలో పడిపోయిన బాలుడి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసి, ఊపిరి ఆగకుండా చూసింది. మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు చెందిన స్మిత్ మేథా (17) తన స్నేహితులతో కలిసి ముంబై సమీపంలోని లోనావాలకు సందర్శనకు వెళ్లాడు.
జోరువర్షంలో విసాపూర్ కోటపైకి ట్రెక్కింగ్ చేస్తుండగా కాలుజారి లోయలో పడిపోయాడు. కదిలే పరిస్థితి లేదు. ఆ సమయంలో అతడి వద్ద మొబైల్ కూడా లేదు. వెంటనే ఆ బాలుడికి చేతికున్న యాపిల్ 7 సిరీస్ వాచ్ గుర్తొచ్చింది. దానినుంచి కుటుంబ సభ్యులకు ఫోన్‌చేశాడు. వారు లొకేషన్ ఆధారంగా అక్కడికి చేరుకొని అతడిని రక్షించారు. యాపిల్ వాచ్ వల్లే బతికి బట్టకట్టానని మేథా పేర్కొన్నాడు. ఈ విషయంపై కృతజ్ఞతలు తెలుపుతూ యాపిల్ సీఈవో టిమ్ కుక్కు మేథా మెయిల్ చేశాడు. త్వరగా కోలుకోవాలని కుక్ బదులిచ్చాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

