Apple iPhone | యాపిల్ యూజర్లకు అలర్ట్.. ఐఫోన్లోకి స్పైవేర్
ఐఫోన్ యూజర్లకు యాపిల్ హెచ్చరికలు జారీ చేసింది. మెర్సినరీ స్పైవేర్ల (కిరాయికి తీసుకొన్న స్పైవేర్) ద్వారా లక్షిత యూజర్ల ఫోన్లు సైబర్ దాడులకు గురికావొచ్చని అలర్ట్ చేసింది.
Apple iPhone | హైదరాబాద్, ఏప్రిల్ 11 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఐఫోన్ యూజర్లకు యాపిల్ హెచ్చరికలు జారీ చేసింది. మెర్సినరీ స్పైవేర్ల (కిరాయికి తీసుకొన్న స్పైవేర్) ద్వారా లక్షిత యూజర్ల ఫోన్లు సైబర్ దాడులకు గురికావొచ్చని అలర్ట్ చేసింది. ఈ మేరకు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 91 దేశాల్లోని పలువురు యూజర్లకు థ్రెట్ నోటిఫికేషన్లను పంపించింది.
ఏమిటీ మెర్సినరీ స్పైవేర్?
ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ తయారు చేసిన పెగాసస్ లాంటి స్పైవేర్లను మెర్సినరీ స్పైవేర్లుగా పిలుస్తారు. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన వీటితో ప్రముఖులైన లక్షిత వ్యక్తులను టార్గెట్‌గా చేసుకుంటారు. సైబర్ దాడులకు గురికాకుండా యాపిల్ ఫోన్లకు ప్రత్యేక రక్షణ ఉంటుంది. అయితే, యాపిల్ ఐడీ సాయంతో మెర్సినరీ స్పైవేర్లు ఐఫోన్లు, ఇతర యాపిల్ ఉత్పత్తులలోకి సులభంగా చొరబడగలవని నిపుణులు చెప్తున్నారు. ఇదే జరిగితే, ఆ ఉత్పత్తుల ద్వారా ఎవరేం చేస్తున్నారన్న ప్రతీ విషయం నేరగాళ్లకు చేరుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Apple
- apple iphone
- India
- Israel
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

