ముస్లింలు భారత్‌లో ఉండకూడదన్న వ్యక్తి హిందువే కాదు: మోహన్ భగవత్

లక్నో: ముస్లింలు భారత్‌లో ఉండకూడదని ఎవరైనా అంటే అతడు హిందువే కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగమైన ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆదివారం నిర్వహించిన ఖ్వాజా ఇఫ్తేకర్ అహ్మద్ రచించిన ‘మీటింగ్ ఆఫ్ మైండ్స్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత ప్రజల డీఎన్ఏ ఒక్కటేనని, హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఒక సంస్థ అని సంఘ్ ఎప్పుడూ విశ్వసిస్తుందని అన్నారు. మైనారిటీలకు సంఘ్ వ్యతిరేకంగా ఉందని లేదా భారతదేశంలో ఇస్లాం ప్రమాదంలో ఉందని భయపడేవారికి వ్యతిరేకంగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందన్నారు.
హిందూ-ముస్లిం ఐక్యత అవసరం గురించి ప్రజలు మాట్లాడేటప్పుడు, మనమంతా ఒకటని, వేరు కాదని మోహన్ భగవత్ అన్నారు. ‘గత 40,000 సంవత్సరాల నుండి మనమంతా అదే పూర్వీకుల వారసులమని నిరూపించబడింది. భారతదేశ ప్రజలకు ఒకే డీఎన్ఏ ఉంది. హిందూ, ముస్లిం అనేవి రెండు సమూహాలు కాదు. ఏకం కావడానికి ఏమీ లేదు. వారు ఇప్పటికే కలిసి ఉన్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆవు ఒక పవిత్ర జంతువు, కానీ ఇతరులను కించపరిచే ప్రజలు హిందుత్వానికి వ్యతిరేకంగా వెళుతున్నారని భగవత్ విమర్శించారు. అలాంటి వారిపై ఎటువంటి పక్షపాతం లేకుండా చట్టం తనదైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
రాజకీయాలు చేయలేని కొన్ని పనులు ఉన్నాయని మోహన్ భగవత్ తెలిపారు. రాజకీయాలు ప్రజలను ఏకం చేయలేవని, ప్రజలను ఏకం చేసే సాధనంగా మారలేవని వ్యాఖ్యానించారు. కానీ ఐక్యతను వక్రీకరించే ఆయుధంగా రాజకీయాలు మారవచ్చని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

