Bridge Collapse| బీహార్‌లో నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన వంతెన.. వారంలోనే మూడోది
ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న బీహార్‌లో మరో వంతెన (Bridge Collapse) కుప్పకూలింది. సివాన్ జిల్లాలో చిన్నపాటి వంతెన ఒకటి కూలి 24 గంటలు గడువక ముందే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. మోతీహరిలో (Motihari) రూ.1.5 కోట్లతో 40 అడుగుల విస్తీర్ణంలో వంతెన నిర్మిస్తున్నారు.
పట్నా: ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న బీహార్‌లో మరో వంతెన (Bridge Collapse) కుప్పకూలింది. సివాన్ జిల్లాలో చిన్నపాటి వంతెన ఒకటి కూలి 24 గంటలు గడువక ముందే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. మోతీహరిలో (Motihari) రూ.1.5 కోట్లతో 40 అడుగుల విస్తీర్ణంలో వంతెన నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 12 గంటలకు అది ఒక్కసారిగా కూలిపోయింది. సిమెంటు, ఇసుక తగినపాళ్లలో సరిపోకపోవడం, కాస్టింగ్ కోసం ఏర్పాటుచేసిన సెంట్రింగ్ పైపు బలహీనంగా ఉండటంతో బ్రిడ్జి కూలిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
దీంతో వారం రోజుల్లోనే రాష్ట్రంలో వంతెనలు కుప్పకూలిపోవడం ఇది మూడోసారి. అరారియాలోని బక్రా నదిపై రూ.12 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి ఈ నెల 18న కూలిపోయిన విషయం తెలిసిందే. ఇక జూన్ 22న (శనివారం) సివాన్‌లోని గండక్ కాలువపై వంతెన కుప్పకూలింది. దారౌందా, మహారాజా గంజ్ బ్లాక్స్‌లోని రెండు గ్రామాలను కలుపుతూ కెనాల్‌పై కట్టిన ఈ బ్రిడ్జ్..చాలా ఏండ్ల క్రితం నాటిదని, కెనాల్‌లోని నీటి ప్రవాహ ధాటికి పిల్లర్లు దెబ్బతిని వంతెన కూలిందని జిల్లా కలెక్టర్ ముకుల్ కుమార్ గుప్తా తెలిపారు.
మంగళవారం అరారియా జిల్లాలో కొత్తగా నిర్మించిన 180 మీటర్ల పొడవైన బ్రిడ్జ్ కుప్పకూలటం సంచలనం రేపింది. దీంతో నదులు, కాలువలపై నిర్మించిన వంతెనల పటిష్టతపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పబ్లిక్ వర్క్స్‌లో నాణ్యతా లోపాలు, అక్రమాల వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
#bridgecollapse #biharnews pic.twitter.com/aWelbuquPB
— Khushbu Goyal (@kgoyal466) June 23, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

