Madhya Pradesh urination row | మూత్ర విసర్జన వివాదంలో ట్విస్ట్.. సీఎం చౌహాన్ మరో వ్యక్తి కాళ్లు కడిగినట్లు విమర్శలు
Madhya Pradesh urination row | మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో గిరిజన కూలీపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసిన వివాదం (Madhya Pradesh urination row) మరో మలుపు తిరిగింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బాధిత వ్యక్తి బదులు మరో వ్యక్తి కాళ్లు కడిగినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఈ మేరకు ఆరోపణలు చేసింది.
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో గిరిజన కూలీపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసిన వివాదం (Madhya Pradesh urination row) మరో మలుపు తిరిగింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బాధిత వ్యక్తి బదులు మరో వ్యక్తి కాళ్లు కడిగినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఈ మేరకు ఆరోపణలు చేసింది. గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేసిన వీడియో క్లిప్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. నిందితుడు ప్రవేశ్ శుక్లాపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ)తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. అతడి ఇంటిని కూడా కూల్చివేసింది. అంతేగాక సీఎం శివరాజ్ చౌహాన్ స్వయంగా బాధిత గిరిజన వ్యక్తిగా పేర్కొన్న దశమత్ రావత్ కాళ్లు కడిగారు. ఈ వీడియో క్లిప్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
కాగా, మూత్ర విసర్జన బాధితుడు దశమత్ రావత్ కాదని, మరో వ్యక్తి అని ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. సీఎం శివరాజ్ చౌహాన్ వేరొకరి కాళ్లు కడిగి డ్రామా చేశారని విమర్శింది. అసలు బాధితుడు కనిపించకుండా పోయాడా? ఇంత పెద్ద కుట్రా? అని ప్రశ్నించింది. సోషల్ మీడియాలో కూడా ఇదే తరహా అనుమానాలు వ్యక్తమయ్యాయి. వైరల్ అయిన వీడియోలోని బాధితుడు 16-17 ఏళ్ల వ్యక్తిగా కనిపించగా, సీఎం చౌహాన్ కాళ్లు కడిగిన వ్యక్తి వయసు 35 నుంచి 38 మధ్య ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంతోపాటు అధికారులు వీటిని ఖండించారు.
మరోవైపు సీఎం చౌహాన్ చేత కాళ్లు కడిగించుకున్న దశమత్ రావత్ మరో వాదన వినిపించాడు. 2020లో ఈ సంఘటన జరిగిందని, మద్యం మత్తులో ఉన్న తనకు ఏం జరిగిందో కూడా తెలియదని చెప్పాడు. తనపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ఎవరో కూడా చూడలేదని అన్నాడు. వీడియో వైరల్ కావడంతో తనను పోలీసు స్టేషన్‌కు, ఆపై కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారని తెలిపాడు. అలాగే వీడియోలో వేధింపులకు గురైన వ్యక్తి తాను కాదని అబద్ధం చెప్పానన్నాడు.
కాగా, నిందితుడు ప్రవేశ్ శుక్లా స్వయంగా నేరాన్ని అంగీకరించాడని, దీంతో ఆ సంఘటన జరిగినట్లు తాను కూడా నమ్మానని దశమత్ రావత్ మీడియాకు తెలిపాడు. నిందితుడు తన తప్పు తెలుసుకున్నాడని, ఎప్పుడో జరిగిన ఈ సంఘటనలో అరెస్ట్ చేసిన ప్రవేశ్ శుక్లాను విడుదల చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో మూత్ర విసర్జన సంఘటనకు సంబంధించిన అసలు బాధితుడు దశమత్ రావత్ కాదని, మరో వ్యక్తి అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
यह वीडियो मैं आपके साथ इसलिए साझा कर रहा हूँ कि सब समझ लें कि मध्यप्रदेश में शिवराज सिंह चौहान है, तो जनता भगवान है।
किसी के साथ भी अत्याचार बर्दाश्त नहीं किया जायेगा। राज्य के हर नागरिक का सम्मान मेरा सम्मान है। pic.twitter.com/vCuniVJyP0
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 6, 2023
पेशाब कांड के पीड़ित ने आरोपी को लेकर कर दी #Shivraj सरकार से बड़ी मांग ! MP Tak @BJP4MP @INCMP pic.twitter.com/rclewGsRKK
— MP Tak (@MPTakOfficial) July 8, 2023
सीधी पेशाब कांड में बड़ा खुलासा,
— शिवराज ने किसी और के पांव धोने की नौटंकी की, असली पीड़ित लापता हैं क्या ?शिवराज जी,
इतना बड़ा षड्यन्त्र ❓मध्यप्रदेश आपको माफ नहीं करेगा। pic.twitter.com/JCvXlUJr7w
— MP Congress (@INCMP) July 9, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

