Uttar Pradesh | లక్నో: యూపీలోని బాలియా జిల్లా జడ్జి అశోక్ కుమార్ కుమారుడిని చంపుతామంటూ బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం, జడ్జికి ఈ నెల 10న ఓ వ్యక్తి వాట్సాప్ కాల్ చేసి, తాను కొత్వాలీ సదర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందినవాడినని, ఎన్కౌంటర్లో మీ అబ్బాయిని చంపేస్తాం అని చెప్పాడు.
దీనిపై గురువారం ఎఫ్ఐఆర్ను నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు సూపరింటెండెంట్ ఎస్ ఆనంద్ చెప్పారు. జడ్జిలు, వారి కుటుంబ సభ్యుల భద్రత గురించి సివిల్ కోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదిస్తున్నామని తెలిపారు.