ఆదివారం పేరు ఎత్తితే చాలు. ఆరోజు హాలిడే. ఏ పనీ చేయకూడదు. ఆఫీసులకు ఎలాగూ సెలవు. ఇక రోజువారి పనులను కూడా కొందరు ఆదివారం పేరుతో వాయిదా వేస్తుంటారు. ముఖ్యంగా వ్యాయామం విషయంలోనూ బద్ధకిస్తుంటారు. రోజూ చేస్తున్నాం కదా. ఒక్క రోజు చేయకపోతే ఏమౌతుంది. ఆదివారం ఒక్క రోజు రెస్ట్ తీసుకుంటాం. మిగితా రోజులు ఫుల్ టు ఎనర్జీతో ఉంటాం.. అని చాలామంది రోజూ ఖచ్చితంగా చేయాల్సిన ఎన్నో పనులు అలా పక్కన పెట్టేస్తుంటారు.
అటువంటి వాళ్లు.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఈ వీడియోను ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే.. ఈ వీడియోను చూస్తే మీరు వ్యాయామం చేయాల్సిన పని లేదు. మీరు కూర్చొని ఒక్క ఇంచు కూడా ముందుకు కదలకుండా ఎక్సర్ సైజ్ చేసినట్టే అని అంటున్నారు ఆయన. ఈ వీడియోను ఒకసారి చూసి వదిలేయడం కాదు.. ఈ వీడియోను డౌన్ లోడ్ చేసుకొని ప్రతి రోజు చూస్తూ ఉండండి. ఈ వీడియోను చూసినప్పుడల్లా మీ శరీరంలోని ప్రతి కండరం షేక్ అవుతుంది. దాంతో మీరు ఇంచు కూడా కదలకుండా.. కసరత్తులు చేసినట్టే లెక్క. అంటూ పలు ఈవెంట్స్ లలో చేసిన జిమ్నాస్టిక్స్ వీడియోను మహీంద్ర షేర్ చేశారు.
ఆనంద్ మహీంద్ర ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారో లేదో.. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కొందరు ఆ వీడియోపై కౌంటర్లు కూడా వేశారు. మరికొందరు అలాంటి ప్రేరణ కలిగించే మరికొన్ని వీడియోలను షేర్ చేశారు.
ఆనంద్ మహీంద్ర గారు.. ఇంతకీ ఈ వీడియోను ఎలా సేవ్ చేయాలి. నాకు చెప్పండి ప్లీజ్ అంటూ కొందరు రిప్లయి ఇస్తే.. కొందరు ఫన్నీ ఫోటోలతో కౌంటర్ ఇస్తున్నారు.