గడ్కరీని చంపేస్తాం.. ఆయన ఆఫీస్‌ను పేల్చేస్తాం.. మూడుసార్లు బెదిరింపు కాల్స్
Nitin Gadkari | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంపేస్తామని, ఆయన కార్యాలయాన్ని పేల్చేస్తామని ఇవాళ ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్స్ చేశాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సిటీలోగల
ముంబై: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంపేస్తామని, ఆయన కార్యాలయాన్ని పేల్చేస్తామని ఇవాళ ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్స్ చేశాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సిటీలోగల గడ్కరీ కార్యాలయానికి ఉదయం 11.25 గంటలకు, 11.32 గంటలకు, 12.30 గంటలకు ఇలా మొత్తం మూడుసార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి.
దాంతో గడ్కరీ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిర్యాదు అందుకున్న నాగ్‌పూర్ పోలీసులు వెంటనే ఘటనపై దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌ను పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని నాగ్‌పూర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాహుల్ మదానే చెప్పారు.
నాగ్‌పూర్‌లోని ఖమ్లా చౌక్ ఏరియాలో నితిన్ గడ్కరీ కార్యాలయం ఉన్నది. ఆ కార్యాలయానికి, నితిన్ గడ్కరీ నివాసానికి మధ్య దూరం కేవలం ఒక కిలోమీటర్ మాత్రమే. కాగా, గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Telangana | తెలంగాణలో కొత్త రాజకీయం.. 27కు పెరుగనున్న మంత్రులు.. మహిళలకు 9లోక్‌సభ, 60 అసెంబ్లీ సీట్లు
Assembly Elections | అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు.. ప్రస్తుత ప్రభుత్వాన్నే కొనసాగిస్తారా? లేక.. రాష్ట్రపతి పాలన విధిస్తారా??
Delimitation | తెలంగాణకు 26 లోక్‌సభ సీట్లు.. పునర్విభజన తర్వాత పెరిగే లోక్‌సభ స్థానాల పటాన్ని విడుదల చేసిన కేంద్రం!
Delimitation | ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. డీలిమిటేషన్‌పై బీజేపీ, కాంగ్రెస్ సొంత వ్యూహాలు?
Deeksha Divas | ఉద్యమానికి ఊపిరిలూదిన దీక్షా దివస్.. నేడు కరీంనగర్ గడ్డపై స్ఫూర్తి సభ
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

