నదిలో కొట్టుకుపోయిన ఆర్మీ జవాన్.. నాలుగు రోజుల తర్వాత మృతదేహం లభ్యం
Army Soldier Swept Away | సెలవుపై ఇంటికి వచ్చిన ఓ ఆర్మీ జవాన్ నదిలో శవమై తేలాడు. కన్నవాళ్లకు పుత్రశోకం మిగిల్చాడు. కతిహార్ జిల్లా మనిహారి బ్లాక్‌లోని ఓ గ్రామానికి చెందిన విశ్వల్ కుమార్
కతిహార్: సెలవుపై ఇంటికి వచ్చిన ఓ ఆర్మీ జవాన్ నదిలో శవమై తేలాడు. కన్నవాళ్లకు పుత్రశోకం మిగిల్చాడు. కతిహార్ జిల్లా మనిహారి బ్లాక్‌లోని ఓ గ్రామానికి చెందిన విశ్వల్ కుమార్ (22) ఇండియన్ ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఛట్ పండుగ నేపథ్యంలో ఇటీవల సెలవుపై ఇంటికొచ్చాడు. గత సోమవారం స్నేహితులతో కలిసి గంగానదిలో ఈతకు వెళ్లాడు.
అయితే, నదీ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కొట్టుకుపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. రెస్క్యూ టీమ్స్‌ను రంగంలోకి దించి విశ్వల్ కుమార్ కోసం గాలింపు చేపట్టారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇవాళ ఉదయం ఆమ్దాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని శవం నది నీళ్లలో తేలింది.
విశ్వల్ తల్లిదండ్రులను అక్కడి తీసుకెళ్లి శవాన్ని చూపించడంతో తమ కుమారుడేనని గుర్తించారు. దాంతో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసి మృతదేహాన్ని వారికి అప్పగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

