నచ్చిన కలల్ని కనొచ్చు
‘నిద్రపోతే ఏవేవో పీడ కలలు వస్తున్నాయ్. పడుకోవాలంటేనే భయంగా ఉంది’ అనే మాటలు చాలా మంది చెప్పడం చూస్తూనే ఉంటాం.
- నిద్రలోనే నియంత్రించొచ్చు!
- ఏఐ ఆధారిత పరికరాన్ని అభివృద్ధి చేసిన అమెరికన్ స్టార్టప్
- 1.25 – 1.66 లక్షలు పలుకనున్న ధర
‘నిద్రపోతే ఏవేవో పీడ కలలు వస్తున్నాయ్. పడుకోవాలంటేనే భయంగా ఉంది’ అనే మాటలు చాలా మంది చెప్పడం చూస్తూనే ఉంటాం. భయపెట్టే కలలు కాకుండా, మనకు నచ్చిన, అందమైన తీపి కలలు (డ్రీమ్స్) కంటే ఎంత బాగుంటుంది? అంతేకాదు.. నిద్రలోనే ఇంజినీర్లు కోడింగ్ రాస్తే ఎలా ఉంటుంది? జాబ్ ఇంటర్వ్యూ లేదా క్రికెట్లో నెగ్గేందుకు అవసరమైన కసరత్తు, మెళకువలను కూడా కలలోనే నేర్చుకొనే అవకాశంవస్తే?? చాలు.. ఊరుకోండి.. హాలీవుడ్ సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా కథలు చెప్పొద్దు అంటారా?? ఆగండి. ఇది నిజం. మనకు నచ్చిన కలల్ని కనడమే కాదు.. కెరీర్ అభివృద్దికి అవసరమైన మెళకువలను కూడా కలలో కసరత్తు చేసుకొనే వినూత్న డివైజ్‌ను అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ ఒకటి తయారు చేసింది. అదే ‘హలో’.
-స్పెషల్ టాస్క్ బ్యూరో (నమస్తే తెలంగాణ)
ఏమిటీ హలో?
నిద్రించే సమయంలో ఎలాంటి కలల్ని కనాలి? డ్రీమ్స్‌లో ఎలాంటి విషయాలను నేర్చుకోవాలన్న అంశాలను నిర్దేశించే వలయాకారం కిరీటం (క్రౌన్) లాంటి పరికరమే ‘హలో’. అమెరికాకు చెందిన ప్రొఫెటిక్ అనే స్టార్టప్ కంపెనీ దీన్ని అభివృద్ధి చేసింది. దీని ధర రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.66 లక్షల వరకు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఎలా పనిచేస్తుంది?
అల్ట్రా సౌండ్, మెషిన్ లర్నింగ్ సాంకేతికతతో పనిచేసే ‘హలో’ కిరీటాన్ని పడుకొనే ముందు తల చుట్టూ పెట్టుకోవాలి. లూసిడ్ డ్రీమ్ స్టేట్లోకి వెళ్లినప్పుడు వచ్చే కలలను ఈ పరికరం విశ్లేషిస్తుంది. అప్పటికే, ఏ తరహా కలలు కనాలనుకొంటున్నామో.. వాటిని ప్రోగ్రామింగ్ ద్వారా ప్రవేశపెడుతుంది. దీంతో కలలో అనవసర విషయాలకు తావు ఉండబోదని కంపెనీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.
కసరత్తు కూడా..
కలలను నియంత్రించడమే కాదు.. డ్రీమ్‌లోనే వివిధ తర్ఫీదులను కూడా ఈ పరికరంతో పూర్తిచేయవచ్చని పరిశోధకులు తెలిపారు. ఒక పని చేసేటప్పుడు గతంలో మనం చేసిన పొరపాట్లను గుర్తించి వాటిని సవరిస్తూ.. భవిష్యత్తులో ఆ పని విజయవంతంగా పూర్తవ్వడానికి అవసరమైన కసరత్తును మేళవిస్తూ.. కలల రూపంలో ఆవిష్కరించే అభ్యసన కూడా ఈ పరికరంలో అందుబాటులో ఉన్నది. కలల ద్వారా నైపుణ్యాలను వృద్ధి చేసుకోవాలంటే, ఏ అంశంలో మెళకువలు సాధించాలనుకుంటున్నారో.. దానికి సంబంధించిన కసరత్తును గతంలో కనీసం ఒక్కసారైనా పూర్తి చేసి ఉండాలని పరిశోధకులు తెలిపారు. గతంలో చేసిన తప్పులు అప్పటికే మెదడులో రిజిస్టరై ఉండటంతో.. కలలో తర్ఫీదు పొందే సమయంలో ఆ తప్పులు పునరావృతం కాకుండా ఉంటుందన్నారు. నిజజీవితంలోని అభ్యసనతో పోలిస్తే, కలలో వారు మరింత మెరుగ్గా కసరత్తు పూర్తిచేయవచ్చన్నారు.
లూసిడ్ డ్రీమ్ అంటే?
నిద్ర పోయే సమయాన్ని ఆర్ఈఎం, నాన్-ఆర్ఈఎంగా పరిశోధకులు విభజిస్తారు. రెప్ప కింద కండ్లను అటూ, ఇటూ ఆడిస్తూ నిద్రపోయే ప్రక్రియను ఆర్ఈఎం అంటారు. దీనికి ‘లూసిడ్ డ్రీమ్’ అని మరో పేరు కూడా ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

