Trending News: ఆకట్టుకుంటున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక డూడుల్..రూపొందించిన అమూల్!!
ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము జూలై 21న నిర్వహించిన ఎన్నికల్లో భారత రాష్ట్రపతిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. 15వ రాష్ట్రపతిగా ఆమె ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ద్రౌపది ముర్ము నిలిచారు. ఈ నెల 25న రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు.
ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము జూలై 21న నిర్వహించిన ఎన్నికల్లో భారత రాష్ట్రపతిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. 15వ రాష్ట్రపతిగా ఆమె ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ద్రౌపది ముర్ము నిలిచారు. ఈ నెల 25న రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు.
రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు దేశ నలుమూలలనుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, అమూల్ భారతీయ సహకార డైరీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సాదర స్వాగతం పలికేందుకు ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. దీన్ని ఇన్‌స్టాగ్రాంలో అమూల్ ఇండియా షేర్ చేసింది. ‘స్వాగతం..మేడం ప్రెసిడెంట్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. రాష్ట్రపతి భవనం ఎదుట ద్రౌపది ముర్ము భారతీయ సంస్కృతి ప్రకారం వందనం చేస్తున్నట్లు డూడుల్ ఉంది. ఈ డూడుల్ పైన ‘ముర్మధర్’ ఇండియా అని రాసి ఉంది. కింద ‘అమూల్..టాప్ పొజిషన్ ఇన్ బటర్స్’ అని రాశారు. ఈ డూడుల్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నది. కొత్త రాష్ట్రపతికి చాలా సృజనాత్మకంగా వెల్కమ్ చెప్పారంటూ అమూల్ ఇండియాపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

