35 మంది ప్రయాణికులను ఎయిర్‌పోర్టులోనే వదిలివెళ్లిన సింగపూర్ విమానం
Amritsar | ఆ విమానం పంజాబ్‌లోని అమృత్సర్ (Amritsar) నుంచి సింగపూర్ వెళ్తున్నది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7.55 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరాలి.
అమృత్సర్: ఆ విమానం పంజాబ్‌లోని అమృత్సర్ (Amritsar) నుంచి సింగపూర్ వెళ్తున్నది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7.55 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరాలి. అయితే దాదాపు 5 గంటల ముందే అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో 35 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు.
సింగపూర్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ (Scoot Airline) విమానం 35 మంది ప్రయాణికులను ఎయిర్‌పోర్టులోనే వదిలేసి వెళ్లిపోయింది. నిర్ణీత సమయం ప్రకారం సాయంత్రం 7 గంటలకు అమృత్సర్ నుంచి విమానం టేకాఫ్ అవ్వాల్సి ఉన్నది. అయితే మధ్యాహ్నం 3 గంటలకే అమృత్సర్ నుంచి వెళ్లిపోయింది. దీంతో సింగపూర్‌కు టికెట్లు బుక్‌చేసుకున్న ప్రయాణికులు అవ్వాక్కవ్వాల్సి వచ్చింది.
కాగా, విమాన సమయంలో జరిగిన మార్పుల గురించి ప్రయాణికులకు తాము ముందుగానే తెలియజేశామన్నారు. ప్యాసింజర్లకు ఈ-మెయిల్ చేశామని అధికారులు వెల్లడించారు. గత నెలలో కూడా ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకున్నది. ఢిల్లీకి వెళ్తున్న గో ఫస్ట్ ఫ్లైట్ విమానం 50 మంది ప్రయాణికులను ఎయిర్‌పోర్టులోనే వదిలి వెళ్లడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

