గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై విజయన్ నోరు మెదపాలి : అమిత్ షా

న్యూఢిల్లీ : కేరళ సీఎం పినరయి విజయన్ గోల్డ్, డాలర్ స్మగ్లింగ్ కేసుపై నోరు మెదపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కేరళ ప్రజలకు సీఎం విజయన్ సమాధానం చెప్పాలని అన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్‌ను విజయన్‌కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని ఈడీ అధికారులు ఒత్తిడి చేశారంటూ కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం రాజకీయ స్టంట్‌గా ఆయన అభివర్ణించారు. ఈ కేసులో వాస్తవాలేంటో అందరికీ తెలుసునని ఓ జాతీయ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ అమిత్ షా పేర్కొన్నారు.
ఈ స్కామ్‌లో సీఎం ప్రమేయం లేకుంటే ముఖ్య కార్యదర్శిని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాషాయ పార్టీని నిరుత్సాహపరుస్తాయని విజయన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కమ్యూనిస్టులు ప్రపంచవ్యాప్తంగా కనుమరుగవుతున్నారని వ్యాఖ్యానించారు. కేరళ ప్రజలు ఎల్డీఫ్, యూడీఎఫ్‌ల పాలనతో విసిగిపోయారని త్రిపునిధురలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీని ప్రత్యామ్నాయంగా ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో తాము మెరుగైన ఫలితాలు రాబడతామని విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

