tomatoes stolen | ఆగని టమాట చోరీలు.. జార్ఖండ్లో 40 కిలోలు లూఠీ
tomatoes stolen | టమాట ధరలు రోజు రోజుకు ఆకాశన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో టమాట చోరీలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా కూరగాయల షాపుల నుంచి 40 కిలోల టమాటాలను లూఠీ (tomatoes stolen) చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
రాంచీ: టమాట ధరలు రోజు రోజుకు ఆకాశన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో టమాట చోరీలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా కూరగాయల షాపుల నుంచి 40 కిలోల టమాటాలను లూఠీ (tomatoes stolen) చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. జార్ఖండ్లోని గుమ్లా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తంగ్రా కూరగాయల మార్కెట్లోని 66 షాపుల నుంచి సుమారు 40 కిలోల టమాటాలు, పది కిలోల అల్లం, రెండు లక్షల విలువైన తూకం యంత్రాలు, డబ్బు, విలువైన వస్తువులు చోరీ అయ్యాయి.

Tomatoes Stolen From Shops
కాగా, శనివారం ఉదయం మార్కెట్కు వచ్చిన కూరగాయల వ్యాపారులు తమ షాపుల తాళాలు పగులగొట్టి ఉండటం చూసి షాకయ్యారు. అలాగే 40 కిలోల టమాటాలు, పది కిలోల అల్లం, తూకం యంత్రాలు చోరీ అయ్యినట్లు తెలుసుకుని ఆందోళన చెందారు. వారంతా కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే ఈ చోరీపై నిరసనగా కూరగాయల మార్కెట్లోని వ్యాపారులు శనివారం తమ షాపులను మూసివేశారు. మరోవైపు టమాటాల దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగలను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

