నిర్లక్ష్యం.. చెరుకు రసం బండి వద్ద కరోనా రోగి.! వీడియో వైరల్
కరోనా రోగి | పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన అంబులెన్స్ డ్రైవర్ కూడా ఈ నిబంధన పట్ల నిర్లక్ష్యం వహించాడు. ఓ రోగితో వెళ్తున్న అంబులెన్స్‌ను ఓ చెరుకు

భోపాల్ : కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పదేపదే ఆదేశిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన అంబులెన్స్ డ్రైవర్ కూడా ఈ నిబంధన పట్ల నిర్లక్ష్యం వహించాడు. ఓ రోగితో వెళ్తున్న అంబులెన్స్‌ను ఓ చెరుకు రసం బండి వద్ద ఆపి ముఖానికి మాస్కు లేకుండా నిల్చున్నాడు. అయితే ఆ అంబులెన్స్‌లో బెడ్‌పై పడుకుని ఉన్న రోగికి కరోనా ఉందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ శాదూల్ జిల్లాలో వెలుగు చూసింది.
ఓ అంబులెన్స్‌లో డ్రైవర్‌తో పాటు మరో ఆరోగ్య సిబ్బంది పీపీఈ కిట్ ధరించి ఉన్నారు. ఇంకో వ్యక్తి అంబులెన్స్ వెనుక భాగంలో బెడ్‌పై పడుకొని ఉన్నాడు. అయితే అంబులెన్స్‌ను చెరుకు రసం బండి వద్ద డ్రైవర్ ఆపాడు. అతను చెరుకు రసం బండి ఎదుట నిల్చుని మాస్కు సరిగా ధరించకుండా నిల్చుని ఫోన్లో మునిగిపోయాడు. మరో వ్యక్తి అంబులెన్స్‌లో కూర్చొని ఉన్నాడు. వెనుకాలే ఓ రోగి బెడ్‌పై పడుకుని ఉన్నాడు.
అయితే అక్కడే ఉన్న ఓ బాధ్యత కలిగిన పౌరుడు ఆ డ్రైవర్‌ను ముఖానికి మాస్కు సరిగా ధరించండి అని సూచించాడు. కరోనా రోగితో వెళ్తున్న అంబులెన్స్‌ను ఇక్కడ ఆపి.. ఇతరులకు వ్యాపింప చేయడం సరికాదు అని చెప్పాడు.
ఇందుకు ఆ డ్రైవర్ స్పందిస్తూ.. తనకు కరోనా లేదని, రోగిని మాత్రమే తరలిస్తున్నామని చెప్పాడు. తనను చెరుకు రసం తాగనివ్వండి అని అన్నాడు. కెమెరాలో రికార్డు చేస్తున్న దృశ్యాలను గమనించిన ఆ డ్రైవర్ వెంటనే మాస్కును సరి చేసుకున్నాడు.
మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు 3,41,887 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 54 వేల మంది చనిపోయారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 1,31,968 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
शहडोल में कुछ स्वास्थ्यकर्मी एक #कोरोना संक्रमित को लेकर खुलेआम शहर के बीच घूमते नजर आए, यही नही कोरोना संक्रमित को लेकर शहर के बीच गन्ने के जूस का आनंद लेते रहे @ndtv @ndtvindia #COVID19India pic.twitter.com/Qg07TcR6ei
— Anurag Dwary (@Anurag_Dwary) April 9, 2021
ఇవికూడా చదవండి..
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్‌పై అవగాన..!
ఈ లక్షణం ఉంటే పుట్టేది ఆడపిల్లే
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
వేసవిలో మామిడిపండ్లు తినొచ్చా ?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

