Blinkit Ambulance | 10 నిమిషాల్లో రోగుల చెంతకు.. బ్లింకిట్ అంబులెన్స్ సేవలు
Blinkit Ambulance | క్విక్ ఈ కామర్స్ సంస్థ బ్లింకిట్ (Blinkit) మరో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది.
Blinkit Ambulance | క్విక్ ఈ కామర్స్ సంస్థ బ్లింకిట్ (Blinkit) మరో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. బ్లింకిట్ ఇప్పటికే ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే నిత్యావసర సరకులు, ఇతర వస్తువులు డోర్ డెలివరీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అంబులెన్స్ సర్వీసెస్‌ను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.
ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన గ్రాసరీస్‌ను పది నిమిషాల్లో డెలివరీ చేసినట్టుగానే .. కేవలం 10 నిమిషాల్లోనే అంబులెన్స్ రోగుల చెంతకు వచ్చేలా ‘బ్లింకిట్ అంబులెన్స్’ (Blinkit Ambulance) సేవలను గురువారం ప్రారంభించింది. తొలుత గురుగ్రామ్ (Gurugram)లోని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. బ్లింకిట్ యాప్‌లోనే ఈ సేవలు అందుబాటులో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.
తాము ప్రవేశపెట్టిన ఈ అంబులెన్సుల్లో ఆక్సిజన్ సిలిండర్, స్ట్రెచర్, మానిటర్, అత్యవసర మందులు, ఇంజెక్షన్లు, వీల్‌చెయిర్ సహా ఒక్కో అంబులెన్స్‌లో పారా మెడికో, ఒక సహాయకుడు, డ్రైవర్ ఉంటారని తెలిపింది. అత్యవసర సమయంలో రోగులకు వీరు సేవలందించనున్నట్లు పేర్కొంది. త్వరలోనే ఈ సేవలు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని బ్లింకిట్ వెల్లడించింది. వచ్చే రెండు లేదా మూడేళ్లలో ఈ సేవలు అన్ని ప్రధాన నగరాలకు విస్తరిస్తామని బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా (Albinder Dhindsa) తెలిపారు.
Ambulance in 10 minutes.
We are taking our first step towards solving the problem of providing quick and reliable ambulance service in our cities. The first five ambulances will be on the road in Gurugram starting today. As we expand the service to more areas, you will start… pic.twitter.com/N8i9KJfq4z
— Albinder Dhindsa (@albinder) January 2, 2025
Also Read..
Cold Weather | రాష్ట్రంలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అత్యల్పంగా సిర్పూర్లో 6.5 డిగ్రీలు
Plane Crashes | భవనంపై కూలిన విమానం.. ఇద్దరు మృతి
Cold wave | గజగజ వణుకుతున్న ఉత్తర భారతం.. జీరోకు పడిపోయిన విజిబిలిటీ.. విమాన, రైలు సేవలకు అంతరాయం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

