యూపీలో దారుణం జరిగింది. రూ.వెయ్యి కోసం ఓ గర్భిణిని అంబులెన్స్ డ్రైవర్ నడిరోడ్డుపై వదిలేసి వెళ్లాడు. దీంతో ఆమె రోడ్డుపక్కన నొప్పులతో బాధపడుతూ కనిపించింది. ఆమెను కుటుంబ సభ్యులు ఓదారుస్తున్నారు. ఈ హృదయ విదారక సంఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది.
ఈ వీడియోను ‘రాజేశ్ సాహు’ అనే జర్నలిస్ట్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లా పండరి గ్రామంలో జరిగింది. కేవలం రూ. వెయ్యి ఇవ్వలేదని నిండు గర్బిణితోపాటు ఆమె బంధువులను అంబులెన్స్ డ్రైవర్ అడవిలో రోడ్డుపై వదిలేసి వెళ్లాడు. అంబులెన్స్ డ్రైవర్ వెయ్యి రూపాయలు అడిగాడని, తమవద్ద లేవని చెప్పడంతో నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లాడని గర్బిణి బంధువులు ఆరోపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబులెన్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
यूपी में एंबुलेस कंपनी और उनके ड्राइवरों की बदमाशी कौन नहीं जानता।
ये वीडियो हमीरपुर के पंधरी गांव का है। परिवार के पास देने के लिए 1000 नहीं थे इसलिए गर्भवती महिला को सड़क पर ही छोड़ दिया।
इतने निर्मम लोगों हैं कि क्या ही कहा जाए। pic.twitter.com/So8OKthLsP
— Rajesh Sahu (@askrajeshsahu) September 6, 2022