అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపివేత

శ్రీనగర్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో పవిత్ర అమర్నాథ్ యాత్ర రిజిష్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు (ఎస్ఐఎస్బీ) ఈ మేరకు గురువారం ప్రకటించింది. “దేశంలో కరోనా పరిస్థితి నేపథ్యంలో అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, శ్రీ అమర్నాథ్జీ యాత్రకు రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపివేశాం. కరోనా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. పరిస్థితి మెరుగుపడిన తర్వాత తిరిగి యాత్ర రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తాం” అని తెలిపింది.
దక్షిణ కశ్మీర్ హిమాయాల్లోని అమర్నాథ్ గుహకు భక్తులు వెళ్లేందుకు ప్రతి ఏటా గట్టి భద్రత మధ్య యాత్ర నిర్వహిస్తారు. బాల్తాల్ మార్గంలో జూన్ 28న, చందన్వారీ మార్గంలో ఆగస్ట్ 22న ప్రారంభమమ్యే యాత్ర కోసం ఈ నెల 1, 15 తేదీల నుంచిపేర్ల నమోదును ప్రారంభించారు. 37 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 446 బ్యాంక్ బ్రాంచ్‌లలో అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన 316 బ్రాంచ్‌లు, జమ్మూ కశ్మీర్ బ్యాంక్‌కు చెందిన 90 బ్రాంచ్‌లు, యస్ బ్యాంక్‌కు చెందిన 40 బ్రాంచుల ద్వారా భక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.
అయితే దేశంలో కరోనా కేసుల ఉధ్రుతి నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు బోర్డు తెలిపింది. ఆన్లైన్ నమోదు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో అన్నది త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

