పుష్ప సినిమా గురించి.. ఆ సినిమాలోని పాటల గురించి.. దేశమంతా నడుస్తున్న పుష్ప ఫీవర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా నార్త్‌లో అయితే శ్రీవల్లి పాటకు జనాలు ఉర్రూతలూగుతున్నారు. శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ వేసిన హూక్ స్టెప్‌ను అచ్చుగుద్దినట్టు దింపుతున్నారు.
తాజాగా లంచ్ చేస్తున్న సమయంలో బఫెట్ వద్ద కొందరు డ్యాన్సర్లు.. చేతుల్లో భోజనం ప్లేట్స్ పెట్టుకొని శ్రీవల్లి హూక్ స్టెప్‌ను దింపేశారు. డ్యాన్సర్లు వేసిన హూక్ స్టెప్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ వీడియో చూసి.. అదిరిపోయింది స్టెప్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.