అలహాబాద్: వర్సిటీ హాస్టల్లో బాంబు తయారుచేస్తున్న ఓ విద్యార్థి ప్రమాద వశాత్తు గాయపడ్డాడు. ప్రభాత్ యాదవ్ (Prabhat Yadav) అనే విద్యార్థి అలహాబాద్ యూనివర్సిటీలో (Allahabad University) ఎంఏ చదువుతున్నాడు. వర్సిటీలోని పీసీ బెనర్జీ హాస్టల్లో (PC Banerjee Hostel) ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం తన గదిలో బాంబు (Bomb) తయారు చేస్తున్నాడు. ఈ క్రమంలో అది తన చేతిలోనే పేలిపోయింది. దీంతో యాదవ్ కుడి చేతికి తీవ్రంగా గాయమైంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యాదవ్‌ను సమీపంలోని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని ఏసీపీ రాజేశ్ కుమార్ యాదవ్ చెప్పారు. అతడు బాంబు ఎందుకు తయారు చేస్తున్నాడన్న విషయం తెలియాల్సి ఉందని వెల్లడించారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.