Anna University | అన్నా వర్సిటీలో అత్యాచారంపై మహిళా పోలీస్ అధికారిణిలతో సిట్.. బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం
Anna University | అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఘటనపై దర్యాప్తు కోసం మహిళా పోలీస్ అధికారిణులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. అలాగే బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
చెన్నై: అన్నా యూనివర్సిటీ (Anna University) క్యాంపస్‌లో విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఘటనపై దర్యాప్తు కోసం మహిళా పోలీస్ అధికారిణులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. అలాగే బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని శనివారం ఆదేశించింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థి సంఘాలతోపాటు ప్రతిపక్షాలు ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
కాగా, ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేయాలంటూ మద్రాస్ హైకోర్టు పిటిషన్ దాఖలైంది. జస్టిస్ ఎస్ఎం సుబ్రమణ్యం, జస్టిస్ వీ లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై శనివారం విచారణ జరిపింది. కేసు దర్యాప్తు కోసం ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారిణులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేయాలని కోర్టు పేర్కొంది. బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే బాధిత విద్యార్థిని చదువు ప్రభావితం కాకుండా చూడాలని, అన్నా యూనివర్శిటీ ఆమె నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

