మరో డాక్టర్ మిస్సింగ్.. ఉగ్ర కుట్ర కేంద్రంగా అల్ ఫలాహ్ వర్సిటీ!
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో అల్ ఫలాహ్ వర్సిటీ పేరు తెరపైకి వచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో దర్యాప్తు సంస్థల దృష్టి ఈ వర్సిటీపై పడింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ బాంబు పేలుడు (Delhi Bomb Blast) ఘటన నేపథ్యంలో అల్ ఫలాహ్ వర్సిటీ (Al-Falah University) పేరు తెరపైకి వచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో దర్యాప్తు సంస్థల దృష్టి ఈ వర్సిటీపై పడింది. ఫరీదాబాద్ పరిధిలోని ధౌజ్ గ్రామంలో 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సంస్థ హర్యానా రాజధానికి కేవలం 30 కి.మీ దూరంలోనే ఉంది. వైట్ కాలర్ టెర్రర్ నెట్‌వర్క్‌కు, రాడికలైజ్డ్ నిపుణుల బృందం తలపెట్టిన ఒక మారణహోమానికి కేంద్ర బిందువుగా మారింది. పోలీసులు, ఇతర దర్యాప్తు బృందాలు పలువురు సిబ్బందిని ప్రశ్నించారు.
మరో డాక్టర్ మిస్సింగ్
డాక్టర్ ఉమర్ కాకుండా, ఉగ్ర దాడికి సహకరించారని అనుమానిస్తున్న, జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్న అతని ఇద్దరు సహాయకులు డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహిన్ షాహిద్లు కూడా ఇదే విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. డాక్టర్ షకీల్‌ను అరెస్ట్ చేయడంతో తనను కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతో ఉమర్ సోమవారం కారు బాంబు పేలుడుకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. డాక్టర్ షాహిన్ కారు నుంచి రైఫిళ్లు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఆరుగురిని యూనివర్సిటీ నుంచి అరెస్ట్ చేశారు. పేలుడు అనంతరం మరో డాక్టర్ నిసర్-ఉల్-హసన్ పరారీలో ఉన్నాడు. హసన్ ప్రస్తుతం ఈ యూనివర్సిటీలో మెడిసిన్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణపై ఆయనను శ్రీ మహరాజ హరి సింగ్ హాస్పిటల్ నుంచి జమ్ము కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ విధుల నుంచి తొలగించారు. అయితే ఇలాంటి రికార్డు ఉన్న వ్యక్తిని ఈ యూనివర్సిటీలో ఎలా నియమించారన్న విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వారితో సంబంధం లేదు: వర్సిటీ
బాంబు పేలుడు ఘటనలో అనుమానిత డాక్టర్లు అల్ ఫలాహ్ వర్సిటీకి చెందని వారు కావడంతో తమపై జరుగుతున్న ప్రచారంపై యూనివర్సిటీ స్పందించింది. నిందితులుగా పేర్కొంటున్న డాక్టర్లు తమ విశ్వవిద్యాలయంలో అధికారికంగా పనిచేయడం తప్ప ఆ వ్యక్తులతో తమకు ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ భూపీందర్ కౌర్ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

