Akola Clashes | అకోలాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. 144 సెక్షన్ అమలు..!
Akola Clashes | మహారాష్ట్ర అకోలా జిల్లా పాతబస్తీలో శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. రంగంలోకి దిగిన పోలీసులు నగరంలో 144 సెక్షన్ విధించారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు పేర్కొన్నారు.
Akola Clashes | మహారాష్ట్ర అకోలా జిల్లా పాతబస్తీలో శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. రంగంలోకి దిగిన పోలీసులు నగరంలో 144 సెక్షన్ విధించారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు పేర్కొన్నారు. చిన్న వివాదం కాస్త ముదిరి రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పాటు వాహనాలు ధ్వంసం చేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో 144 సెక్షన్ విధించినట్లు అకోలా కలెక్టర్ నీమా అరోరా పేర్కొన్నారు.
నిరసనకారుల గుంపు పలు వాహనాలను ధ్వంసం చేసిందని, వివాదస్పద ఘటన తర్వాత పాతబస్తీ పోలీస్ స్టేషన్ ఎదు జనం గుమిగూడారని అధికార వర్గాలు తెలిపారు. ఓ గుంపు వాహనాలే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల అకోలాలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. కొద్దిరోజుల కిందట అకోట్ ఫైల్ ప్రాంతంలో రెండువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
Delhi-NCR | ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు అమలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

