Air India | ఎట్టకేలకు రష్యా నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం
రష్యాలోని (Russia) మగదాన్ (Magadan) ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలో శాన్ఫ్రాన్సిస్కోకు (San Francisco) తరలిస్తున్నామని ఎయిర్ ఇండియా (Air India) ప్రకటించింది.
న్యూఢిల్లీ: రష్యాలోని (Russia) మగదాన్ (Magadan) ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలో శాన్ఫ్రాన్సిస్కోకు (San Francisco) తరలిస్తున్నామని ఎయిర్ ఇండియా (Air India) ప్రకటించింది. గురువారం ఉదయం 10.27 గంటలకు (రష్యా కాలమాన ప్రకారం) మగదాన్ నుంచి ఎయిర్ ఇండియా ఏఐ173డీ (Air India AI127D) విమానం ప్రయాణికులు, సిబ్బందితో గమ్యస్థానానికి బయలుదేరిందని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఫ్లైట్‌లోని ప్రయాణికులకు మరోసారి ఎలాంటి అసౌకర్యం కలగకుండా రిసీవ్ చేసుకునేందుకు శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్టులో సహాయక సిబ్బంది సంఖ్యను పెంచి, వారిని అప్రమత్తం చేసినట్లు తెలిపింది.
ఈ నెల 6న ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు ఎయిర్ ఇండియాకు చెందిన AI173 విమానం బయలుదేరింది. కొద్దిసేపటి తర్వాత ఓ ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్ రష్యాలోని సమీపంలోని మగదాన్ విమానాశ్రయాన్ని సంప్రదించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. ఇందుకు అనుమతి ఇవ్వడంతో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిసి 232 మంది వరకు ఉన్నారు. అయితే ప్రయాణికులను శాన్ఫ్రాన్సిస్కోకు తరలించేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాన్ని పంపించింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ముంబై నుంచి ఆ విమానం రష్యాకు బయలుదేరింది.
UPDATE: AIR INDIA FLIGHT AI173D TAKES OFF FOR SAN FRANCISCO FROM MAGADAN
Flight AI173D from Magadan, Russia (GDX) is now airborne for San Francisco (SFO), carrying all passengers and crew. The flight departed GDX at 1027 Hours on 08 June 2023 (local time) and is expected to…
— Air India (@airindia) June 7, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

