బ్లాక్‌బాక్స్ లభ్యం
అహ్మదాబాద్‌లో ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ), గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) అధికారులకు బ్లాక్‌బాక్స్, డిజిటల్ వీడియో రికార్డర్స్ లభ్యమయ్యాయి. ఈ మేరకు పౌరవిమానయానశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
- హాస్టల్ భవనం పైకప్పు మీద ఏటీఎస్ బృందాలకు లభ్యం
- దర్యాప్తులో కీలకం కానున్న బ్లాక్‌బాక్స్ సమాచారం
అహ్మదాబాద్ : అహ్మదాబాద్‌లో ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ), గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) అధికారులకు బ్లాక్‌బాక్స్, డిజిటల్ వీడియో రికార్డర్స్ లభ్యమయ్యాయి. ఈ మేరకు పౌరవిమానయానశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రమాద స్థలంలో రెసిడెంట్ డాక్టర్స్ హాస్టల్ భవనం పైకప్పు మీద విమాన శకలాలలో బ్లాక్‌బాక్స్ దొరికిందని పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడంలో బ్లాక్‌బాక్స్ కీలకం కానుంది. సాధారణంగా విమానం తోక భాగంలో బ్లాక్‌బాక్స్‌ను అమర్చుతారు. ప్రమాదాల్లో పేలుడు ద్వారా ఉత్పన్నమయ్యే మంటల తట్టుకునేలా, 1100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద గంటపాటు ఉన్నా ధ్వంసం కాకుండా వీటిని రూపొందిస్తారు.
ఇందులో విమానానికి సంబంధించిన ఫ్లైట్ డాటా రికార్డర్(ఎఫ్డ్ఆర్) వంటి సాంకేతిక సమాచారం, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్(సీవీఆర్) సంభాషణల సారాంశం నిక్షిప్తమై ఉంటుంది. ఇందులో విమానంలోని ఇద్దరు పైలట్ల మాటలు రికార్డవుతాయి. ప్రమాదానికి ముందు వారు ఏం మాట్లాడుకున్నారనేది తెలిస్తే దర్యాప్తు సులభమవుతుంది. బ్లాక్‌బాక్స్ పక్కనే డీవీఆర్లు ఉంటాయి. విమానంలోని సీసీటీవీ కెమెరాల ద్వారా రికార్డయిన దృశ్యాలు ఇందులో ఉంటాయి. బ్లాక్‌బాక్స్, డీవీఆర్‌లోని డాటాని ఫోరెన్సిక్ బృందాలు విశ్లేషిస్తాయి. ఇందులోని సమాచార వివరాలు దర్యాప్తులో కీలక ఆధారాలుగా నిలుస్తాయి. గుజరాత్ ప్రభుత్వానికి చెందిన 40 మంది అధికారులు దర్యాప్తులో భాగస్వాములవుతున్నారని పౌరవిమానయానశాఖ తెలిపింది. విమానం 29 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరడం, గాల్లోకి ఎగరడానికి మొత్తం రన్‌వేను ఉపయోగించుకోవాల్సి రావడం వంటి అంశాలు విమాన పనితీరుపై సందేహాలు కలిగిస్తున్నదని అంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

