ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి జడ్ కేటగిరి భద్రత
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ : ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ( MP Asaduddin Owaisi ) జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో అసదుద్దీన్‌కు సీఆర్పీఎఫ్ బలగాలు భద్రత కల్పించనున్నారు.
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని హపూర్ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా.. హపూర్- ఘజియాబాద్ మార్గంలోని చిజారసీ టోల్‌ప్లాజా వద్ద ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కేసులో నిన్ననే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
నిందితుల నుంచి కాల్పులకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఓ మతానికి వ్యతిరేకంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని, దీంతోనే ఒవైసీపై కాల్పులు జరిపినట్లు చెప్పారన్నారు. నిందితులిద్దరిని కోర్టులో హాజరు పరుస్తాం చెప్పారు.
నిందితుల్లో ఒకరైన సచిన్ పండిట్ బీజేపీలో క్రియాశీలక కార్యకార్త. పార్టీ సభ్యత్వానికి సంబంధిన రిసిప్ట్‌ను సచిన్ సోషల్ మీడియాలో ఉంచారు. అందులో దేశ్ భక్త్ సచిన్ హిందూ అని తన పేరును పేర్కొన్నాడు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, ఎంపీ మహేశ్ శర్మలతో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

