AIIMS Delhi | జపాన్ నుంచి రక్తాన్ని తెప్పించి.. గర్భస్థ శిశువును కాపాడిన ఎయిమ్స్ వైద్యులు
అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్ర్తాల సంస్థ (ఎయిమ్స్)లో అద్భుతం జరిగింది. అత్యంత అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళకు మృత శిశువు జన్మించకుండా కాపాడింది. వివరాల్లోకి వెళితే... హర్యానాలోని గ్రామీణ ప్రాంత మహిళ ఒకరు ఏడుసార్లు గర్భం ధరించి, అన్నిసార్లూ గర్భంలోనే శిశువును కోల్పోయారు.
AIIMS Delhi | న్యూఢిల్లీ : అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్ర్తాల సంస్థ (ఎయిమ్స్)లో అద్భుతం జరిగింది. అత్యంత అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళకు మృత శిశువు జన్మించకుండా కాపాడింది. వివరాల్లోకి వెళితే… హర్యానాలోని గ్రామీణ ప్రాంత మహిళ ఒకరు ఏడుసార్లు గర్భం ధరించి, అన్నిసార్లూ గర్భంలోనే శిశువును కోల్పోయారు. ఎనిమిదోసారి ఆ దంపతులు న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌ను సంప్రదించారు. ఆమె శరీరంలోని యాంటీబాడీస్ ఆమె గర్భంలోని శిశువుకు ముప్పుగా పరిణమిస్తున్నాయని వైద్యులు గుర్తించారు.
గర్భిణి రక్తం ఆర్‌హెచ్ నెగెటివ్ గ్రూప్ అని, అది ఆమె గర్భంలోని శిశువు బ్లడ్ టైప్నకు భిన్నమైనదని గుర్తించారు. ఆ గర్భస్థ శిశువును ప్రాణాలతో కాపాడాలంటే, ఇంట్రాయుటెరిన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం ఒకటే ఏకైక మార్గమని నిర్ణయించారు. ఆర్‌హెచ్ నెగెటివ్ బ్లడ్ గ్రూప్గలవారు లక్ష మందిలో ఒకరే ఉంటారు. భారత దేశంలో ఈ రక్తంగలవారు ఒకరు కనిపించినప్పటికీ, రక్తదానం చేయడానికి ఆ వ్యక్తి నిరాకరించారు. వెంటనే ఇంటర్నేషనల్ బ్లడ్ రిజిస్ట్రీకి సమాచారం అందించారు. జపాన్‌లోని రెడ్ క్రాస్ సొసైటీ స్పందించి, ఈ రక్తాన్ని భారత్‌కు పంపించింది. 48 గంటల్లో ఈ రక్తం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు చేరుకుంది. ఈ రక్తాన్ని గర్భిణి గర్భంలోని శిశువుకు ట్రాన్స్‌ఫ్యూజ్ చేశారు. ఆరోగ్యవంతమైన ఆడ శిశువు జన్మించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

